ఏపీ మాజీ మంత్రి నారాయణకు చెందిన ఎన్ స్పిరా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఏపీ సీఐడీ సోదాలు రెండోరోజూ కొనసాగాయి. మాదాపూర్‌లోని మెలాంజ్ టవర్స్‌లో ఈ కార్యాలయం ఉంది. అమరావతి భూముల కొనుగోలు వ్యవహారంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ సీఐడీ అధికారులు నిన్న ఉదయం పది గంటల నుంచి రాత్రి వరకు సోదాలు చేశారు. తిరిగి ఇవాళ ఉదయం నుంచే సోదాలు ప్రారంభించారు. సోదాల్లో సుమారు 40 మంది అధికారుల బృందం పాల్గొన్నట్లు తెలుస్తోంది.
కంపెనీలోని కంప్యూటర్లను పరిశీలించారు. పలు హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది సిబ్బంది వద్ద నుంచి కూడా వివరాలు సేకరించినట్లు సీఐడీ అధికారులు వెల్లడించారు. నేటితో సోదాలు పూర్తయినట్లు అధికారులు తెలిపారు.