CID Arrested Couple in Co Operative Bank Case in Hyderabad : హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ సహకార బ్యాంకును మోసం చేసిన కేసులో.. కీలక నిందితులను సీఐడీ(CID) అధికారులు అరెస్ట్ చేశారు. 14 సంవత్సరాల క్రితం నమోదైన కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసి నేరాభియోగపత్రం దాఖలు చేశారు. తాజాగా ఈ స్కాంతో సంబంధం ఉన్న ఓ జంటను పట్టుకున్నారు. కూకట్‌పల్లిలో ఉన్న కన్యకా పరమేశ్వరి సహకార బ్యాంకులో( Kanyaka Parameshwari Co Operative Bank ) 2009లో అవకతవకలు జరిగాయి. బ్యాంకు డైరెక్టర్లు, ఉద్యోగులు కలిసి మోసానికి పాల్పడ్డారు. బినామీ పేర్ల మీద రుణాలు తీసుకొని డైరెక్టర్లు, ఉద్యోగాలు సొంత ఖాతాలకు మళ్లించుకున్నారు.
దీనిపై బ్యాంకు లిక్విడేటర్ అన్నపూర్ణ 2009 అక్టోబర్ 10న ఫిర్యాదు చేయడంతో.. సీఐడీ అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో రూ.2.86 కోట్ల మోసానికి పాల్పడినట్లు అధికారులు తేల్చారు. పలువురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే 2015లో నేరాభియోగపత్రం దాఖలు చేశారు. అయితే ఈ కేసులో కన్యకా పరమేశ్వరి డైరెక్టర్‌గా ఉన్న పద్మ... రూప పేరుతో రుణం తీసుకున్నట్లు గుర్తించారు. ఆమెతో పాటు అదే బ్యాంకులో ఉద్యోగిగా పనిచేసిన భర్త కృష్ణ వర్మకు.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. సీఐడీ డైరెక్టర్ మహేశ్ భగవత్ ( CID Director Mahesh Bhagavat ) పర్యవేక్షణలో.. ఈ ఇద్దరిని అరెస్ట్ చేసిన అధికారులు రిమాండ్‌కు తరలించారు.
Bodhan Fake Challan Scam Update : బోధన్ నకిలీ చలాన్ల కుంభకోణంలో సీఐడీ ఛార్జ్‌షీట్
Adilabad DCCB Scam Update : మరోవైపు ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు.. బేల బ్రాంచిలో వెలుగుచూసిన రూ.2.86 కోట్ల కుంభకోణం కేసును సీఐడీ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే బ్యాంకు సొమ్ము దుర్వినియోగంలో భాగస్వాములైన 11 మంది ఉద్యోగులపై డీసీసీబీ అధికారులు సస్పెండ్ చేశారు. డీసీసీబీ బేల బ్రాంచిలో స్టాఫ్ అసిస్టెంట్ కం క్యాషియర్‌గా పనిచేస్తున్న శ్రీపతి కుమార్.. ఇందులో ప్రధాన సూత్రధారిగా ఉన్నారు. రూ.2కోట్ల 86 లక్షల 40వేలు దుర్వినియోగమైనట్లు డీసీసీబీ అధికారులు గుర్తించారు.
ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.ఆర్‌బీఐ, నాబార్డు నిబంధనల ప్రకారం జిల్లాస్థాయిలో అధికారులు బేల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. మరోవైపు ముందుగా రూ.2,86,40,000 దుర్వినియోగం జరిగినట్లు భావించినా.. ప్రాథమిక విచారణలో రూ.1.40 లక్షలకు సంబంధించిన లావాదేవీలకు ఆధారాలు లభించాయి.
మిగిలిన రూ.2.85 కోట్లు దుర్వినియోగం జరిగినట్లు తేల్చిన అధికారులు సీఐడీకి ఫిర్యాదు చేశారు. మరోపక్క బేల పోలీసులు ఆదిలాబాద్ డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రికార్డుల పరిశీలించారు. ఈ క్రమంలోనే దుర్వినియోగమైన డబ్బుల నుంచి.. సంబంధిత ఉద్యోగుల ఖాతాల్లోంచి అధికారులు ఇప్పటిదాకా రూ.51 లక్షల నగదు, డిపాజిట్లను స్వాధీనం చేసుకోన్నారు. మిగిలిన డబ్బులను రాబట్టుకునే ప్రయత్నం కొనసాగుతోంది.
DCCB Scam: డీసీసీబీ కుంభకోణంలో 15మందిపై కేసు నమోదు
డీసీసీబీలో రూ.2.86 కోట్ల కుంభకోణం.. నగదు మళ్లింపుపై సమగ్ర విచారణ