ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్నంటిన క్రిస్మస్​ సంబురాలు - జనంతో కిక్కిరిసిపోయిన చర్చిలు - క్రిస్మస్ వేడుకలు తాజా వార్తలు

Christmas Celebrations In Telangana 2023 : రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. విద్యుద్దీప కాంతులు, క్రిస్మస్‌ ట్రీలతో ప్రార్థనా మందిరాలు అందంగా ముస్తాబయ్యాయి. పలు మందిరాల్లో క్రీస్తు జననాన్ని వివరించేలా బొమ్మలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి.

Christmas Celebrations In Hanamkonda
Christmas Celebrations In Telangana 2023
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 25, 2023, 3:50 PM IST

Updated : Dec 25, 2023, 10:31 PM IST

తెలంగాణలో ఘనంగా క్రిస్మస్​ సంబురాలు - కళకళలాడుతున్న చర్చిలు

Christmas Celebrations In Telangana 2023 : తెలంగాణ రాష్ట్రంలో క్రిస్మస్‌ సంబురాలు అంబరాన్నంటాయి. ప్రార్థనా మందిరాలన్నీ కళకళలాడుతూ కనిపిస్తున్నాయి. క్రైస్తవ సోదరులు ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకుంటున్నారు. ఏసుక్రీస్తు జన్మించిన పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణలో చర్చిలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. చర్చిలను రంగురంగుల విద్యుత్‌ దీపాలతో అందంగా అలంకరించారు. పలు మందిరాల్లో క్రీస్తు జననాన్ని వివరించేలా బొమ్మలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. క్రిస్మస్‌ సందర్భంగా భాగ్యనగరం రంగురంగుల విద్యుత్ దీపాలతో కాంతులీనుతోంది.

Former Minister Talasani Srinivas Yadav At Wesley Church : సికింద్రాబాద్‌లో సెయింట్‌ మేరీ చర్చిలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కీర్తనలు పాడుతూ యువతి, యువకులు ఆనందోత్సాహాంతో నృత్యాలు చేసి అలరించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన క్రైస్తవులు యేసును స్తుతిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. లక్డికాపుల్‌ చర్చిలో యేసు కీర్తినలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్(Talasani Srinivas Yadav) వెస్లీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. యేసుక్రీస్తు చల్లని దీవెనలతో ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లో క్రిస్మస్ వేడుకలను క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు.

మెదక్ కేతడ్రల్ చర్చిలో అంగరంగ వైభవంగా క్రిస్మస్ వేడుకలు

Christmas Celebrations In Hanamkonda : హనుమకొండ జిల్లా కాజీపేటలోని ఫాతిమా చర్చిలో(Fathima Matha Church) కేక్ కటింగ్ చేసి క్రిస్మస్‌ను జరుపుకున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో క్రిస్మస్‌ వేడుకల్లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. యేసుక్రీస్తు ప్రవచించిన ప్రేమ, కరుణ, శాంతి అనే సుగుణాలను పాటిస్తే అందరి జీవితాలు సుఖశాంతులతో ఉంటాయని మంత్రి అన్నారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఖమ్మంలోని పలు చర్చిలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ప్రార్థనలో పాల్గొన్నారు. రాష్ట్రం ప్రభువు దీవెనలతో సుభిక్షంగా ఉండాలని వారు ఆకాంక్షించారు.

Harish Rao At CSI Church In Siddipet : సిద్దిపేట జిల్లా సిఎస్​ఐ చర్చిలోని క్రిస్మస్ వేడుకల్లో మాజీమంత్రి హరీశ్​రావు పాల్గొన్నారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి క్రైస్తవులందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మంచిర్యాల క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్‌రావుకు(MLA Prem sagar Rao) క్రైస్తవులు పూలమాల వేసి సన్మానించారు. అలాగే చెన్నూరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో యేసు చరిత్రపై ప్రదర్శనలతో క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా జరుపుకున్నారు. నిజామాబాద్‌లో నూతనంగా నిర్మించిన చర్చిలో క్రైస్తవులు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యేసుప్రభుకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఒకరికరు క్రిస్మస్‌ పరిదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

జెరూసలెం నుంచి మట్టి, హాలెండ్‌ సాంకేతికతతో నిర్మాణం - ఆ చర్చిలో తొలి క్రిస్మస్ వేడుకలు

రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా సెమీ క్రిస్మస్‌ వేడుకలు - అందంగా ముస్తాబైన చర్చిలు

Last Updated : Dec 25, 2023, 10:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.