క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని చర్చిలను విద్యుత్ దీపాల అలంకరణతో అందంగా ముస్తాబు చేశారు నిర్వాహకులు. సికింద్రాబాద్లోని సెయింట్ మేరీస్, వెస్లీ, మిలీనియం, సెయింట్ థామస్ చర్చిలను అంగరంగా వైభవంగా అలంకరించారు. రకరకాల డెకరేషన్లతో నూతనంగా అలంకరించి తమ భక్తిని చాటుకున్నారు. ఏసుప్రభు జీవన వృత్తాంతాన్ని తెలియజేసే పశువుల పాకలో ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఏసు ప్రభువు జన్మదిన వేడుకలు అర్ధరాత్రి నుండే ప్రారంభమయ్యాయి. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఏసుక్రీస్తు భజనలు, కీర్తనలు, సంగీతంతో ఏసుప్రభు జీవిత గమనాన్ని తెలియజేశారు.
ఇవీ చూడండి:ఇవాళ క్రిస్మస్ పర్వదినం