భాగ్యనగరంలో క్రిస్మస్ సందడి మొదలైంది. హైదరాబాద్ హైటెక్ సిటీలోని ఓ హోటల్ వినూత్నంగా ఉండాలని పోచంపల్లి ఇక్కత్ చీరలతో క్రిస్మస్ ట్రీ ఏర్పాటు చేశారు. స్థానిక ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ ప్రాచుర్యం కల్పించాలనే ఉద్దేశంతో.. క్రిస్మస్ ట్రీ ఏర్పాటు చేసినట్లు హోటల్ నిర్వాహకులు తెలిపారు.
'వోకల్ ఫర్ లోకల్' నినాదంతో.. ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మంజీర గ్రూప్ సంస్థల ఛైర్మన్ యోగనంద్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పోచంపల్లి ఇక్కత్ చీరలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందని పేర్కొన్నారు. వినూత్నమైన విధానంలో రూపొందించిన క్రిస్మస్ ట్రీ చూడముచ్చటగా ఉందన్నారు.
ఇదీ చదవండి: క్రిస్మస్ వేడుకల్లో నక్షత్రాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకుంటారంటే?