ETV Bharat / state

children's day 2021: చిల్డ్రన్స్ డే స్పెషల్.. ఆట.. మాట.. ఆవిష్కరణ - తెలంగాణ వార్తలు

ఒకరికి క్రీడలంటే ఆసక్తి.. మరొకరికి నృత్యమంటే మక్కువ.. ఇంకొకరికి సరికొత్త ఆవిష్కరణలంటే జిజ్ఞాస.. పిల్లల్లో ఒక్కొక్కరికి ఒక్కో రంగంపై అభిరుచి ఉంటుంది. వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి అనేందుకు ఈ బాలబాలికలే నిదర్శనం. ఆదివారం బాలల దినోత్సవం(children's day 2021) సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న చిన్నారులపై ‘ఈనాడు-ఈటీవీ భారత్’ ప్రత్యేక కథనం..

children's day 2021
children's day 2021
author img

By

Published : Nov 14, 2021, 8:38 AM IST

Updated : Nov 14, 2021, 10:09 AM IST

భారతదేశ తొలి ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ పుట్టిన రోజైన నవంబర్‌ 14న దేశవ్యాప్తంగా బాలల దినోత్సవం(children's day 2021) జరుపుకుంటాం. నెహ్రూకి పిల్లలంటే ఎంతో ఇష్టం. పిల్లలు కూడా ఆయన్ను చాచా నెహ్రూ అంటూ ప్రేమగా పిలిచేవారు. అందుకే నెహ్రూకి పిల్లలకు మధ్య ఉన్న బంధానికి గుర్తుగా ఆయన పుట్టిన రోజున పాఠశాలల్లో విద్యార్థులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇవాళ చిల్డ్రన్స్ డే సందర్భంగా వివిధ రంగాల్లో సత్తా చాటుతున్న చిన్నాలు గురించి తెలుసుకుందాం రండి..

ప్రధానిగా మారి..సమస్యలకు పరిష్కారం చూపి..

పాఠశాలలో విద్యార్థులకు ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. వాటిని ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు సరికొత్త మార్గాన్ని ఎంచుకుంది పాతబస్తీలో కుర్మగూడలో కేర్‌ పాఠశాలలో పదోతరగతి చదువుతున్న సఫూర సిద్ధిఖీ. మూడేళ్ల కిందట ‘కేర్‌ పార్లమెంట్‌’ పేరిట ప్రత్యేక కార్యక్రమం తీసుకువచ్చింది. ఆమె ఆలోచనకు టీచ్‌ ఫర్‌ ఇండియా సహకారం అందిస్తోంది. ప్రతి శుక్రవారం పార్లమెంట్‌ సమావేశం ఏర్పాటు చేసి చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనికి ప్రధానమంత్రిగా సఫూర వ్యవహరిస్తోంది. పాఠశాలలో చర్చావేదికలు నిర్వహించి సమస్యలు తెలుసుకుని పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుంటున్నారు. వీరి చర్చల కారణంగా పాఠశాలలో నీటి సమస్యకు పరిష్కారం లభించి.. నిత్యం వాటర్‌ ట్యాంకర్‌ వేయించుకోవాలని యాజమాన్యం నిర్ణయించింది. ‘రెండేళ్ల కిందట మాక్‌ పార్లమెంట్‌ ఆలోచన వచ్చింది. సమావేశాల నిర్వహణ టీచ్‌ ఫర్‌ ఇండియా సంస్థనే చూసుకుంటుంది. మాక్‌ పార్లమెంట్‌ కారణంగా ఎన్నో సమస్యలు పరిష్కరించుకోగలుగుతున్నాం.’’ అని సఫూర వివరించింది.

సఫూర సిద్ధిఖీ

బంగారు భవితకు బాటలు వేసుకునేందుకు బాల్యం నుంచే శ్రమిస్తున్నారు వీరు. బడిలో పుస్తకాలతో కుస్తీ పడుతూ మైదానంలో చెమటోడుస్తున్నారు. శనివారం ఇందిరాపార్క్‌ సమీపంలో స్కేటింగ్‌ ట్రాక్‌పై సాధన చేస్తున్న చిన్నారులు.

స్కేటింగ్ చేస్తున్న చిన్నారులు

గిన్నిస్‌ రికార్డుల్లో చోటు సాధించి..

పదో తరగతి చదువుతున్న కేపీహెచ్‌బీకాలనీకి చెందిన దంగేటి సాత్విక కూచిపూడి నృత్యంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించింది. ముసునూరి ఇందిరా శిక్షణలో మంచినర్తకిగా ఎదిగింది. ఊహ తెలిసినప్పట్నుంచి నృత్యంపై ఇష్టం పెంచుకుని.. అందుకు తగ్గట్టుగా సాధన చేసింది. తెలుగు యూనివర్సిటీ నుంచి సర్టిఫికెట్‌ కోర్సు పూర్తి చేసింది. దేశంలో 1500కుపైగా స్టేజీ ప్రదర్శనలు ఇచ్చింది. సిలికానంధ్ర ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచస్థాయి రెండు సమ్మేళనాలలో పాల్గొని గిన్నిస్‌ రికార్డులో భాగస్వామిగా నిలిచింది.

సాత్విక

వైజ్ఞానిక ‘‘రవి’కిరణం

జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్స్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న రవికర్‌రెడ్డి వినూత్న ఆవిష్కరణలతో జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించాడు. ఇళ్లలో రోగులు, వృద్ధులను సులువుగా తరలించేందుకు వీలుగా ‘ఈజీలిఫ్ట్‌’ను రూపొందించాడు. ఇంట్లో అమ్మమ్మ పడిన ఇబ్బందులను గమనించి వృద్ధులు, రోగులు సులువుగా మంచం లేదా కుర్చీలోంచి లేచి అటు..ఇటు తిరిగేందుకు వీలుగా లిఫ్ట్‌ తయారు చేయాలన్న ఆలోచనతో దీన్ని రూపొందించాడు. గతేడాది ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ ఇంటింటా ఇన్నోవేటర్స్‌ కార్యక్రమంలో మొదటి స్థానం దక్కించుకున్నాడు. రాష్ట్ర వైజ్ఞానిక పోటీల్లో మొదటి స్థానం సాధించి జాతీయస్థాయికి ఎంపికయ్యాడు. తనకు గైడ్‌ టీచర్‌ కవిత ఎంతో సహకారం అందించారని, మున్ముందు మరిన్ని ఆవిష్కరణలు చేస్తానని రవికర్‌రెడ్డి చెబుతున్నాడు.

రవికర్‌రెడ్డి

ఆత్మవిశ్వాసమే పరుగు పెట్టిస్తోంది!

నిరుపేద కుటుంబం.. తల్లిదండ్రులు కూలీలు. చదివేది ప్రభుత్వ పాఠశాల.. ఆత్మవిశ్వాసమే అండగా ముందుకు సాగుతూ పతకాలు ఒడిసిపడుతోంది బాపనపల్లి అక్షర. హయత్‌నగర్‌కు చెందిన అక్షర స్థానిక జడ్పీహెచ్‌ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఆరో తరగతి నుంచి ఆటలపై మక్కువ పెంచుకుని ఖోఖోలో సాధన ప్రారంభించింది. ఆమె ఆసక్తిని గమనించి పీఈటీ భాస్కర్‌రెడ్డి ప్రోత్సాహం అందించారు. ఆయన సహకారాన్ని అందిపుచ్చుకుని రెండుసార్లు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంది. ఎనిమిది సార్లు రాష్ట్ర టోర్నమెంట్లు ఆడి ఉత్తమ ప్రతిభ కనబరిచింది. అథ్లెటిక్స్‌ విభాగంలో లాంగ్‌జంప్‌, 100మీటర్లు, 800 మీటర్ల కేటగిరీలో రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని సత్తా చాటింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు అక్షర వివరించింది.

అక్షర

ఇదీ చదవండి: Balakrishna unstoppable: బాలయ్య టాక్ షోలో డార్లింగ్ హీరో!

Last Updated : Nov 14, 2021, 10:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.