ETV Bharat / state

'కలాం పేరు పెట్టారు.. కలెక్టర్​ అవుతా'

మతిస్థిమితం లేని అమ్మ చిన్నప్పుడే వదిలేసింది. అనాథశ్రమంలోని వ్యక్తులే తల్లిదండ్రుల్లా లాలించారు. అబ్దుల్ కలాం తనకి పేరు పెట్టారు. తనపేరు మీద ఉన్న పాఠశాలలోనే చదువుతూ...ఈతలో పతకాలు సొంతం చేసుకోంటున్న ఆ అమ్మాయే..పూజా ఈమాన్ ..!

Child swimmer pooja eman Dreams Aabout Collector
'కలాం పేరు పెట్టారు.. కలెక్టర్​ అవుతా'
author img

By

Published : Jul 25, 2020, 7:51 PM IST

పూజ పవిత్రమైన కార్యం. ఈమాన్ అంటే నమ్మకం.. ఈరెండూ పదాలనూ కలిపి అబ్దుల్ కలాం ఆ చిన్నారికి పూజా ఈమాన్ అని పేరు పెట్టారు. చిట్టితల్లి చల్లగా ఉండాలని దీవించారు. కలాం పెట్టిన తన పేరును.. కలకాలం గుర్తుండిపోయేలా కృషిచేస్తోందా అమ్మాయి. ఈతలో పతకాలు ఒడిసి పడుతున్న చిన్నారి.. పెద్దయ్యాక కలెక్టర్ అయి తనలాంటి వారికి అండగా ఉంటానని చెబుతోంది.

2009 సెప్టెంబరులో ఒకరోజు.. కడప జిల్లా రైల్వేకోడూరు వంతెనపై రైళ్లు దూసుకుపోతున్నాయి. వంతెన కింద ఓ ఆభాగ్యురాలు ప్రసవ వేదన పడుతోంది. నొప్పులు భరించలేక అరుస్తోంది. రైళ్ల శబ్దంలో ఎవ్వరికీ వినిపించడంలేదు. ఏ బండీ రానప్పుడు వినే నాథుడే ఎవరూ అక్కడికి రాలేదు. కొన్ని గంటలు అవస్థపడి ఆడబిడ్డని ప్రసవించింది. తల్లి వేదనకు పసిపాప రోదన తోడైంది. బిడ్డను పట్టించుకునే స్థితిలో లేదా తల్లి. గంటలు గడిచిపోయాయి. ఎవరి ద్వారానో సమాచారం అందుకున్న సామాజిక సేవాసంస్థ ప్రతినిధులు అక్కడికి వచ్చారు. తల్లీబిడ్డలను క్షేమంగా కడపజిల్లా మైలవరంలోని రాజా ఫౌండేషన్ అండ్ షేర్ ఛారిటబుల్ ట్రస్ట్ డాడీ హోమ్​కు తరలించారు.

ఆమె పేరుతో పాఠశాలలు..

ఆశ్రమానికైతే తీసుకొచ్చారు కానీ, ఆ తల్లి వివరాలేవీ తెలుసుకోలేకపోయారు నిర్వాహకులు. పైగా మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్ల బిడ్డను పట్టించుకునే పరిస్థితిలో లేదు. వారం రోజులయ్యేసరికి బిడ్డను వదిలేసి ...ఆశ్రమాన్ని వదిలి వెళ్లిపోయిందామె. ఆశ్రమ నిర్వాహకులు ఎంత వెతికినా దొరకలేదు. పత్రికా ప్రకటన ఇచ్చినా లాభం లేకపోయింది. తల్లితో అనాథశ్రమానికి చేరుకున్న ఆ పసిబిడ్డ.. నిజంగానే అనాథగా మారింది. హోమ్ నిర్వాహకులే ఆ బుజ్జాయికి తల్లితండ్రులయ్యారు. తల్లిని తెచ్చి ఇవ్వలేకపోయినా బాగా పెంచాలని నిర్ణయించుకున్నారు. తమ సంకల్పం నేరవేరేదిశగా అబ్దుల్ కలాం ఆశీస్సులను పొందాలని భావించారు. చిన్నారి కథంతా ఆయనకు ఉత్తరం రాసి..పేరు పెట్టాల్సిందిగా కోరారు. దిల్లీనుంచి పిలుపు వచ్చింది. చిన్నారిని తీసుకుని వెళ్లారు హోమ్ నిర్వాహకులు. చిట్టితల్లిని చేతుల్లోకి తీసుకుని ముద్దుచేశారు కలాం. ప్రేమారా.. పూజా ఈమాన్ అని నామకరణం చేశారు. ఈ చిన్నారికి బంగారం లాంటి భవిష్యత్తు ఉంటుందని ఆకాంక్షించారు. అంతేకాదు అనాథ చిన్నారుల కోసం పాఠశాల ప్రారంభించాలని హోమ్ నిర్వాహకుడు రాజారెడ్డికి చెప్పారు. ఆ మేరకు పూజా ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభించారు. అక్కడే పూజా ఈమాన్​ తొమ్మిదో తరగతి చదువుతోంది.

కలెక్టరవ్వాలని..

జగద్విఖ్యాత శాస్త్రవేత్త ఆశీస్సులు అందుకున్న పూజా ఈమాన్ చిన్నప్పటినుంచి చురుకైన పిల్ల. ఈతలో చేపలా విన్యాసాలు చేస్తూ దూసుకుపోయేది. మూడో తరగతినుంచి రకరకాల పోటీల్లో పాల్గొంటూ వచ్చింది. ఐదేళ్లలోనే స్వర్ణ, రజత పతకాలు గెలుచుకుంది. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ సత్తా చాటింది. 2018లో చెన్నైలో జరిగిన దక్షిణాది అంతర్ రాష్ట్ర ఈత పోటీల్లో పూజ రజత పతకం సాధించింది. అదే ఏడాది ఎనిమిది రాష్ట్రాల సౌత్ వెస్ట్ జోనల్ ఛాంపియన్ పోటీల్లో స్వర్ణ, కాంస్య పతకాలు దక్కించుకుంది. గతేడాది నెల్లూరులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపిన పూజా జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. ఈత కొలనులోకి దూకిందంటే ..బ్రెస్ట్, బ్యాక్​స్ట్రోక్, బటర్​ప్లై స్ట్రైక్ రకాల్లో సత్తా చాటుతోంది. ఈతలో దేశానికి ప్రాతినిథ్యం వహించాలన్నది నా ఆకాంక్ష. అందుకు తగ్గట్టుగా కష్టపడుతున్నా. హోమ్ నిర్వాహకులు నాకు అందిస్తున్న ప్రోత్సాహం గురించి ఎంతా చెప్పినా తక్కువే. తండ్రిలా చూసుకునే రాజారెడ్డి సార్, నన్ను కంటికి రెప్పలా కాపాడే ప్రసన్నక్క రుణం తీర్చుకోలేను అంటోంది పూజ. ఆటల్లో అదరగొట్టే పూజ చదువుల్లో సరస్వతి. వ్యాసరచన పోటీల్లో, చిత్రలేఖనంలోనూ ముందుటోంది. క్లాస్​లో ఫస్ట్ ర్యాంక్ నాదే. కలెక్టర్ అవ్వాలన్నది నా లక్ష్యం. అప్పుడైతే నాలాంటి అనాథలను ఎందరినో ఆదరించొచ్చు అంటోంది పూజ. ఈ చిన్నారి వయసు పన్నెండేళ్లే. ఈ బంగారు తల్లి అనుకున్న శిఖరాలు అధిరోహించాలని కోరుకుందాం.

ఇదీ చూడండి. 'కిశోర్‌ మృతిపై అనుమానం... స్పందించాలి ప్రభుత్వం​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.