బాల్య వివాహాలను ప్రోత్సహించినా, చిన్నపిల్లలకు పెళ్లి చేయాలని ప్రయత్నించినా బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం నేరమే అవుతుందని బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు అన్నారు. చంపాపేట డివిజన్ చిలుకబస్తీ కాలనీలో మైనర్ బాలిక వివాహం జరుగుతుందనే విశ్వసనీయ సమాచారం అందుకున్న అచ్యుతరావు... బాల్య సంరక్షణాధికారులు ప్రవీల, వెంకట్, కంచన్‌బాగ్ పోలీసులతో కలిసి వివాహాన్ని అడ్డుకున్నారు. పెళ్లి కూతురుగా ముస్తాబైన మైనర్ బాలికకు, ఆమె తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇప్పించారు. నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న కాలనీల్లో స్వచ్ఛంద సంస్థలు, పోలీసులు పిల్లల చట్టాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అచ్యుతరావు తెలిపారు.
ఇవీ చూడండి: జగన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లనున్న కేసీఆర్