ETV Bharat / state

Cm KCR tour in Delhi: ఈనెల 25న మరోసారి హస్తినకు సీఎం కేసీఆర్!

ఈ నెల 25న ముఖ్యమంత్రి కేసీఆర్ (Chief Minister KCR)దిల్లీ వెళ్లే అవకాశముంది. ఈ నెల 26న దిల్లీలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమావేశం (cm's meeting) జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఈ సమావేశం కానుంది. ఇందులో ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ఝార్ఖండ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల సీఎంలు పాల్గొనే అవకాశం ఉంది.

Chief Minister KCR tour in Delhi on the 25th of this month
Cm KCR tour in Delhi: ఈనెల 25న మరోసారి హస్తినకు సీఎం కేసీఆర్!
author img

By

Published : Sep 23, 2021, 9:30 AM IST

Updated : Sep 23, 2021, 11:53 AM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​ శనివారం దిల్లీ వెళ్లే (kcr tour in delhi) అవకాశముంది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు, అభివృద్ధి పనులను సమీక్షించేందుకు కేంద్రహోంశాఖ ఈ నెల 26న ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటుచేసింది. ఆదివారం ఉదయం 11 గంటలకు దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో హోంమంత్రి అమిత్‌షా నేతృత్వంలో ఈ భేటీ జరుగనుంది. ఇందులో ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ఝార్ఖండ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల సీఎంలు పాల్గొనే అవకాశం ఉంది.

మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు, అభివృద్ధి పనులపై సమావేశంలో చర్చిస్తారు. దిల్లీ సమావేశం నేపథ్యంలో సీఎం కేసీఆర్ బుధవారం సమీక్ష నిర్వహించారు. సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, పోలీసు, ఆర్​ అండ్ బీ ఉన్నతాధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి... రాష్ట్రం తరఫున ఉంచాల్సిన ప్రతిపాదనలపై చర్చించారు.

మావోయిస్టు వారోత్సవాలు...

భారత కమ్యూనిస్టు పార్టీ (cpi) (మావోయిస్టు) 17వ ఆవిర్భావ వారోత్సవాలు మంగళవారం నుంచి జరుగుతున్నాయి. వారోత్సవాలను(Maoist Weeks) ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్‌, పార్టీ అధికార ప్రతినిధి జగన్‌తో పాటు బీకేటీజీ (భద్రాద్రి కొత్తగూడెం-తూర్పుగోదావరి) డివిజన్‌ కమిటీ కార్యదర్శి ఆజాద్‌ లేఖలు విడుదల చేశారు.

అప్రమత్తమైన కేంద్రం

ఈనేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు, అభివృద్ధి పనులను సమీక్షించేందుకు కేంద్రహోంశాఖ ఈ నెల 26న ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటుచేసింది.

ఇప్పటికే దిల్లీ వెళ్లొచ్చిన కేసీఆర్​

ఈ నెల 1న కేసీఆర్​ దిల్లీకి వెళ్లారు. దేశ రాజధానిలో తెరాస కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సీఎం.. ఆ పనుల నిమిత్తం దిల్లీకి వెళ్లారు. అక్కడ కేవలం 3 రోజుల పాటు బస చేయాలని భావించిన కేసీఆర్​.. పలు కార్యక్రమాల దృష్ట్యా అక్కడే ఉండిపోయారు. 2వ తేదీన దిల్లీలో తెరాస కార్యాలయానికి కేసీఆర్​ శంకుస్థాపన చేశారు. ఆ కార్యక్రమంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

భూమి పూజ అనంతరం 3న ప్రధాని మోదీ(PM NARENDRA MODI)తో సీఎం కేసీఆర్​ భేటీ అయ్యారు. సుమారు 50నిమిషాల పాటు మోదీతో సమావేశమైన కేసీఆర్​.. రాష్ట్రానికి సంబంధించిన పది అంశాలపై విడివిడిగా పది లేఖలు అందజేశారు. యాదాద్రి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రావాల్సిందినగా మోదీని కేసీఆర్ ఆహ్వానించారు.

ఇదీ చూడండి: Maoist: మావోయిస్టు వారోత్సవాలు షురూ.. తెలంగాణకు కొత్త సారథి!

Last Updated : Sep 23, 2021, 11:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.