కేంద్ర నిధులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చర్చకు వస్తారని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రకటించారు. కేంద్ర నిధులపై చర్చకు రావాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు సవాల్ విసిరారు. కేంద్ర నిధులపై ఆర్థికమంత్రికి స్పష్టతలేకపోవడం సిగ్గుచేటన్నారు. దుబ్బాకలో భాజపా కార్యకర్తల జోలికి వస్తే ఉపేక్షించబోమని డీకే అరుణ హెచ్చరించారు.
చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్‌లోకి పంపించి హరీశ్‌రావే టికెట్ ఇప్పించారని ఆమె ఆరోపించారు. దుబ్బాకలో తెరాస చేసిన అభివృద్ధి ఏంటో హరీశ్ చెప్పాలని నిలదీశారు. తెరాసపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు.