ETV Bharat / state

ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ - KCR letter details

ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. పార్లమెంట్ కొత్త భవన సముదాయానికి శంకుస్థాపన చేస్తుండటం గర్వకారణమని.. లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు.

Chief Minister KCR letter to Prime Minister Modi about Central‌ Vista Project
ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ
author img

By

Published : Dec 9, 2020, 10:17 AM IST

Updated : Dec 9, 2020, 1:41 PM IST

ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ

దేశ రాజధానిలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించబోయే పార్లమెంట్ కొత్త భవన సముదాయం సెంట్రల్ విస్టాకు శంకుస్థాపన చేస్తున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాన మంత్రికి సీఎం కేసీఆర్ లేఖ రాశారు.

గొప్ప ప్రాజెక్ట్​ అయిన సెంట్రల్ విస్టా దేశానికి గర్వకారణంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కొనియాడారు. దేశ రాజధానిలో ప్రభుత్వ కార్యాలయాల సముదాయం అవసరాలకు తగినట్లుగా లేకపోవడమే కాకుండా.. అవి వలస పాలనకు గుర్తుగా ఉన్నాయని సీఎం అభిప్రాయపడ్డారు. దేశ రాజధానిలో ఇలాంటి నిర్మాణం అవసరం ఎప్పటి నుంచో ఉందని పేర్కొన్నారు.

సెంట్రల్ విస్టా ప్రాజెక్టు ఆత్మగౌరవానికి, ప్రతిష్ఠకు, పునరుజ్జీవనానికి, పటిష్ఠమైన భారతదేశానికి చిహ్నంగా నిలుస్తుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టు త్వరగా నిర్మాణం కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

Last Updated : Dec 9, 2020, 1:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.