కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ తెలంగాణ కోసం చేసిన కృషి మరవ లేనిదని... అటువంటి నేత ఇక లేరనే ఆలోచన కలిచి వేస్తోందని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ అన్నారు. హైదరాబాద్ ఆదర్శ్ నగర్లోని పార్టీ కార్యాలయంలో ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాళేశ్వరం సందర్శించిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశంలో చెప్పిన మాటలు నిజంగా హాస్యాస్పదంగా ఉన్నాయని... అక్కడ ప్రత్యక్షంగా చూసి కూడా ప్రతిపక్షాలపై బురదచల్లడం ఎంత వరకు సబబు అని ఆయన ప్రశ్నించారు.
ఇవీ చూడండి: 'దేశం గొప్ప నాయకురాలిని కోల్పోయింది '