Balka Suman Fire On BJP: భాజపా భరతం పట్టేందుకు యువత సిద్ధం కావాలని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న ప్రధాని మోదీ హామీ ఏమైందని ప్రశ్నించారు. దొంగే.. దొంగ అన్నట్లుగా భాజపా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. కేంద్రంలో ఉన్న 9 లక్షల ఖాళీల గురించి బండి సంజయ్ ఎందుకు అడగడంలేదని ప్రశ్నించారు.
గడిచిన ఏడేళ్లలో తెరాస ప్రభుత్వం 1.32 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందని బాల్క సుమన్ తెలిపారు. కొత్త పరిశ్రమలతో 16 లక్షల మందికి ప్రైవేట్ ఉద్యోగాలు దక్కాయని పేర్కొన్నారు. కొత్త ఏడాదిలో వేలాది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వస్తాయని అన్నారు.
'తెలంగాణ భాజపా నేతలు గుజరాతీలకు గులాంలుగా మారారు. వాళ్లు గుజరాతీలకు బానిసలైపోయారు. వాళ్లలో తెలంగాణ నెత్తురు లేదు... తెలంగాణ పౌరుషం లేదు. వారికి రాష్ట్ర అభివృద్ధి గురించి పట్టింపే లేదు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ హామీ ఏమైంది. కేంద్రంలో 9 లక్షల ఖాళీల గురించి సంజయ్ ఎందుకు అడగడంలేదు. దొంగే దొంగ అన్నట్లుగా భాజపా వ్యవహరిస్తోంది. గడిచిన ఏడేళ్లలో తెరాస ప్రభుత్వం 1.32 లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది. కొత్త ఏడాదిలో వేలాది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు సైతం ఇస్తాం.' - బాల్క సుమన్
ఇదీ చదవండి: tarun chug in bandi sanjay deeksha: కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలిచ్చారు: తరుణ్ చుగ్
Niranjan reddy on BJP And congress : 'కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్ర మరచి భాజపాకు సహకరిస్తోంది'