హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని మధురానగర్ ప్రధాన వీధుల్లో స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, వెంగళరావు నగర్ డివిజన్ తెరాస అధ్యక్షురాలు దేదీప్య ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది సోడియం క్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రతి ఇల్లు తిరుగుతూ రసాయనాలు చల్లారు.
లాక్‌డౌన్ నిబంధనల్ని ప్రజలు తప్పనిసరిగా అనుసరించాలని ఎమ్మెల్యే కోరారు. బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెరాస నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'ఈ రెండు చిట్కాలతో కరోనా నుంచి రక్షణ!'