ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఓ యువకుడిని హైదరాబాద్ ఎస్సార్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. బల్కంపేటకు చెందిన ఓ యువతి, ఏపీలోని కాకినాడకు చెందిన వెంకట సురేశ్ కుమార్ కొద్ది రోజులగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి అమ్మాయి వద్ద నుంచి పెద్ద మొత్తంలో నగదు, బంగారం తీసుకొని ఉడాయించాడు.
విషయం గ్రహించిన బాధితురాలు ఎస్సార్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. అమ్మాయి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడిని అరెస్టు చేసిన పోలీసులు, అతడికి సహకరించిన బంధువులపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఇవీ చూడండి: 'ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి'