హైదరాబాద్ బేగంపేటలోని ఓ హోటల్లో అంబిషన్స్ ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
విద్యావిధానంలో కొత్త మార్పులు తీసుకొచ్చిన వారికి, పలు కళాశాలలకు అవార్డులను ఆయన ప్రధానం చేశారు. ఆయా రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని సత్కరించారు. ప్రతిభ ఉన్న వారు తప్పకుండా రాణిస్తారని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. విద్యార్థులకు ఇష్టమైన రంగం ఎంపిక చేసుకున్నప్పుడు ఆ రంగంలో బాగా రాణించే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.
ఇదీ చూడండి : పోలీసుల అదుపులో భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్