ETV Bharat / state

'ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. వైసీపీ ఇంటికి వెళ్లడం ఖాయం' - Chandrababu news

Chandrababu Tour in Srikakulam : ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పొందూరులో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో కలిసి రోడ్​షోలో పాల్గొన్నారు. పొందూరు చేనేత కార్మికులకు అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

TDP CHIEF CHANDRA BABU
టీడీపీ అధినేత చంద్రబాబు
author img

By

Published : Dec 22, 2022, 8:14 PM IST

Chandrababu Tour in Srikakulam : ఆంధ్రప్రదేశ్​ను జగన్ నాశనం చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రపై సీఎం జగన్‌ సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారని ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పొందూరు రోడ్​షోలా ఆరోపించారు. ఇప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చంద్రబాబు పిలుపునిచ్చారు. అధికారం శాశ్వతం కాదని.. వైకాపా నాయకులు దాన్ని గుర్తించాలని సూచించారు. మూడు రోజుల ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా పొందూరులో చంద్రబాబు రోడ్​షో నిర్వహించారు.

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. వైసీపీ ఇంటికి వెళ్లడం ఖాయమని తెలిపారు. చెత్త మీద పన్ను వేసిన ఘనత జగన్‌కే దక్కుతుందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగినట్లు కేంద్రం చెబుతోందని పేర్కొన్నారు. ఒక్క నీటి పారుదల ప్రాజెక్టు పూర్తి చేశారా? అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పొందూరు చేనేత కార్మికులకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఉత్తరాంధ్రలో మూడు రోజుల పర్యటన..: ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు విజయవాడ నుంచి విశాఖకు విమానంలో చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గాన విజయనగరం బయల్దేరారు. చంద్రబాబుకు టీడీపీ నేతలు గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఇదేం కర్మ రాష్ట్రానికి పేరుతో మూడు రోజుల పాటు రాజాం, బొబ్బిలి, విజయనగరం నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ రాత్రికి చంద్రబాబు రాజాంలో జరిగే సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని.. అక్కడే బస చేయనున్నారు. శుక్రవారం బొబ్బిలి, 24న విజయనగరంలో ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.