Chandrababu Naidu Arrest : టీడీపీ అధినేత చంద్రబాబు బస చేసిన ప్రాంతానికి అర్ధరాత్రి నుంచే పోలీసులు వ్యూహాత్మకంగా చేరుకున్నారు. అరెస్టులో భాగంగా రాత్రే అనంతపురం నుంచి బలగాలను నంద్యాలకు రప్పించారు. చంద్రబాబు కార్వాన్ చుట్టూ రోప్ పార్టీని ఏర్పాటు చేశారు. తమ చర్యలకు అడ్డంకులు లేకుండా చేసుకున్న పోలీసులు అడ్డుపెట్టిన తెలుగుదేశం వాహనాలను జేసీబీతో తొలగించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, మీడియా బృందాలను బయటకు పంపారు. చంద్రబాబు బస్సు వద్ద ఉన్న నాయకులను అదుపులోకి తీసుకొని.. పోలీసు వాహనాల్లో తరలించారు. కాలవ శ్రీనివాసులు, భూమా బ్రహ్మానందరెడ్డి, ఎ.వి.సుబ్బారెడ్డి, బి.సి.జనార్దన్‌రెడ్డి, అఖిలప్రియ, ఇతర నేతలను అరెస్టు చేశారు.
Chandrababu Naidu Arrest Updates : తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో.. అనంతపురం డీఐజీ రఘురామిరెడ్డి నేతృత్వంలో పోలీసులు చంద్రబాబు ఉన్న చోటుకి చేరుకున్నారు. చంద్రబాబును కలవాలంటూ ఎన్ఎస్జీ సిబ్బందిని రఘురామిరెడ్డి కోరారు. ఈ సమయంలో కలవాల్సిన పనేంటని పక్కనే ఉన్న తెలుగుదేశం నాయకులు డీఐజీని ప్రశ్నించారు. మీకెందుకు చెప్పాలంటూ రఘురామిరెడ్డి టీడీపీని నాయకులు ఎదురు ప్రశ్నించారు. ఈ కేసుతో మీకేం సంబంధం అంటూ అలానే వాదించారు. అసలు కేసేంటో చెప్పాలంటూ తెలుగుదేశం నేతలు రఘురామిరెడ్డిని నిలదీశారు.
Live Updates : చంద్రబాబుకు నా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నా: పవన్‌కల్యాణ్
EX CM Chandrababu Naidu Detained : కేసు వివరాలపై నోరు మెదపని డీఐజీ రఘురామిరెడ్డి చంద్రబాబు బస చేసిన బస్సు తలుపుల వద్దకు దూసుకెళ్లారు. వారి తీరుపై తెలుగుదేశం నాయకులు మండిపడ్డారు. విషయమేంటో చెప్పకుండా ఎందుకు హడావుడి చేస్తున్నారని నిలదీశారు. మీడియా ప్రతినిధులు ప్రశ్నించినా రఘురామిరెడ్డి ఎదురుదాడి చేయడం తప్ప సమాధానం ఇవ్వలేదు.
Chandrababu Responded to His Arrest: ఎన్ని కుట్రలు పన్నినా న్యాయమే గెలుస్తుంది.. చంద్రబాబు
తెలుగుదేశం నాయకుల మధ్య సుదీర్ఘంగా వాగ్వాదం : ఈ క్రమంలో డీఐజీ రఘురామిరెడ్డి, తెలుగుదేశం నాయకుల మధ్య సుదీర్ఘంగా వాగ్వాదం సాగింది. కేసు గురించి చెప్పకుండా అర్ధరాత్రులు ఇల రావడం సరికాదన్నారు. తెల్లవారుజామున చంద్రబాబు కాన్వాయ్ కదులుతుందనే సమాచారం వచ్చిందని, అందుకే వచ్చామని.. రఘురామిరెడ్డి చెప్పారు. అసలు అలాంటిదేమీ లేదని తెలుగుదేశం నేతలు స్పష్టం చేసినా డీఐడీ వెనక్కి తగ్గలేదు. మరోవైపు... ప్రోటొకాల్ ప్రకారం ఉదయం 5.30 గంటల వరకూ వీఐపీని కలిసేందుకు అనుమతి ఇవ్వబోమని ఎన్ఎస్జీ సిబ్బంది డీఐజీ రఘురామిరెడ్డితో తేల్చిచెప్పారు. ఉదయం 5.30 నిమిషాల తర్వాత.. వైద్య పరీక్షలు నిర్వహించి.. ఆ నివేదికను అధికారులకు పంపి అక్కడి నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం చంద్రబాబు వద్దకు పంపుతామని ఎన్ఎస్జీ కామాండెంట్ స్పష్టం చేశారు.
Lokesh Protests in the Wake of Chandrababu Arrest: నా తండ్రిని చూడటానికి వెళ్లొద్దా: లోకేశ్ ఆగ్రహం
Chandrababu Arrest in Nandyala: నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్.. రోడ్డుమార్గంలో చంద్రబాబు తరలింపు