తిరుపతి ఉపఎన్నిక, సీఐడీ నోటీసుల పరిణామాలు, మున్సిపల్ ఎన్నికల ఫలితాల విశ్లేషణపై .. తెదేపా అధినేత చంద్రబాబు... పార్టీ కార్యాలయంలో నేతలతో సమావేశమయ్యారు. ఏప్రిల్ 17న తిరుపతి ఉపఎన్నిక జరుగుతున్నందున తిరుపతి పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల నేతలతోనూ చర్చించనున్నారు.
పార్టీ అభ్యర్థిగా ఇప్పటికే మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మిని ఖరారు చేశారు. నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశం జరిపి లోటుపాట్లపై చర్చించనున్నారు.
ఇదీ చదవండి: 2 లక్షల కోట్లను దాటిన తెలంగాణ వార్షిక బడ్జెట్