ETV Bharat / state

జీవో నెంబర్​ 3ను అమలు చేయాలంటూ సీఎం జగన్​కు చంద్రబాబు లేఖ - chandrababu letter to cm on tribal rights

ఏపీ సీఎం జగన్​కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. జీవో నంబర్ 3ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లోని ఉపాధ్యాయుల పోస్టులు వారికే దక్కేలా చూడాలని లేఖలో కోరారు.

chandrababu-letter-to-cm-jagan-on-tribal-rights
జీవో నెంబర్​ 3ను అమలు చేయాలంటూ సీఎం జగన్​కు చంద్రబాబు లేఖ
author img

By

Published : Jun 19, 2020, 11:11 AM IST

ఆంధ్రప్రదేేశ్​లో బలహీన వర్గాల సాధికారతలో, అణగారిన వర్గాల హక్కులు కాపాడేందుకు గత ఏడాదిగా రాష్ట్ర ప్రభుత్వం విముఖంగా ఉన్నట్లు వ్యవహరిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్ 3 ప్రయోజనాలు కాపాడుతూ షెడ్యూల్ ఏరియాలో టీచర్ పోస్టులు గిరిజనులకే దక్కేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్​కు ఆయన లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి లోపం గిరిజనులకు శాపంగా మారిందని... వైకాపా ఉదాసీనత వల్లే బీసీల సాధికారతకు విఘాతం కలుగుతోందని ధ్వజమెత్తారు.

వైకాపా చిత్తశుద్ధి లోపం వల్లే స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు 34 శాతం నుంచి 24 శాతానికి కోతపడిందని మండిపడ్డారు. జీవో నంబర్ 3 ప్రయోజనం కాపాడి గిరిజన సాధికారతకు దోహదపడాలని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయం గిరిజనాభివృద్దిపై తిరోగమన ప్రభావం చూపుతుందని... గిరిజనులందరికి సమాన అవకాశాలు ఉండేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సరైన విధంగా వ్యవహరించి షెడ్యూల్ ఏరియాలో టీచింగ్ పోస్టులను జీవో నంబర్ 3 ప్రకారం గిరిజనులకే దక్కేలా సరైన చర్యలను తక్షణమే చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

chandrababu-letter-to-cm-jagan-on-tribal-rights
జీవో నెంబర్​ 3ను అమలు చేయాలంటూ సీఎం జగన్​కు చంద్రబాబు లేఖ

ఇదీ చదవండి: రాష్ట్రస్థాయిలో సత్తాచాటిన జడ్చర్ల విద్యార్థిని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.