CBN TWEET ON AMBATI: ఏపీలోని పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో కుమారుడి మృతితో తురకా గంగమ్మ కుటుంబానికి వచ్చిన ప్రభుత్వ పరిహారాన్ని మంత్రి అంబటి అడిగారని వచ్చిన ఆరోపణలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పందించారు. 'ఛీ.. మీరు పాలకులా' అంటూ ట్వీట్ చేశారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అని మండిపడ్డారు. ఘటనపై ఈనాడు లో వచ్చిన కథనాన్ని చంద్రబాబు ట్వీట్‌కు జత చేశారు.
-
ఛీ...మీరు పాలకులా?#IdhemKarmaManaRashtraniki pic.twitter.com/QH2ACL8T1W
— N Chandrababu Naidu (@ncbn) December 20, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">ఛీ...మీరు పాలకులా?#IdhemKarmaManaRashtraniki pic.twitter.com/QH2ACL8T1W
— N Chandrababu Naidu (@ncbn) December 20, 2022ఛీ...మీరు పాలకులా?#IdhemKarmaManaRashtraniki pic.twitter.com/QH2ACL8T1W
— N Chandrababu Naidu (@ncbn) December 20, 2022
ఇదిగో నీ లంచాల బాగోతం.. రాజీనామా ఎప్పుడు: మంగమ్మ లంచం డిమాండ్ చేసినట్లు నిరూపిస్తే అంబటి రాజీనామా చేస్తానన్నారని జనసేన నేత బోనబోయిన శ్రీనివాసయాదవ్ గుర్తుచేశారు. ఇదిగో నీ లంచాల బాగోతం.. రాజీనామా ఎప్పుడు? అని ప్రశ్నించారు. రేపల్లె నుంచి పారిపోయి వచ్చినట్లు సత్తెనపల్లి నుంచి కూడా పారిపోయారా? ఎద్దేవా చేశారు. తురకా మంగమ్మ దంపతులకు వెంటనే పరిహారం చెక్కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సాయంత్రానికి ఇవ్వకపోతే ఆర్డీవో కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మంగమ్మ దంపతులకు హాని జరిగితే అంబటి రాంబాబుదే బాధ్యత అని తెలిపారు. గంగమ్మ కుటుంబానికి జనసేన అండగా ఉంటుందని తెలిపారు.
ఇవీ చదవండి: