ETV Bharat / state

జగన్ విజయనగరం వచ్చినా.. రామతీర్థంపై ఎందుకు మాట్లాడలేదు? - సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్

వైకాపా ప్రభుత్వంపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైకాపా 19నెలల పాలనలో 127 ఆలయాలపై దాడులు జరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేవాలయాలను కాపాడే బాధ్యత ఏపీ సీఎం జగన్​కు లేదా అని ప్రశ్నించారు. ఏపీ విజయనగరం పర్యటనకు వచ్చిన సీఎం... రామతీర్థం ఆలయానికి వచ్చే బాధ్యత లేదా అని నిలదీశారు. జగన్ పాలనలో హిందూ ఆలయాలను దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఆలయాల్లో అన్యమత ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.

జగన్ విజయనగరం వచ్చినా.. రామతీర్థం ఘటనపై ఎందుకు మాట్లాడలేదు?
author img

By

Published : Jan 2, 2021, 5:51 PM IST

Updated : Jan 2, 2021, 8:12 PM IST

ఏపీ విజయనగరం జిల్లా బోడికొండ కోదండరాముడి విగ్రహ ధ్వంసంపై చెలరేగిన రాజకీయ దుమారం కొనసాగుతోంది. తెదేపా, భాజపా, వైకాపా నేతల పర్యటనతో రామతీర్థం రణరంగంగా మారింది. పూర్తిగా ఎటు చూసినా రాజకీయ వేడి కనిపిస్తోంది. నాటకీయ పరిణామాల నడుమ తెదేపా అధినేత చంద్రబాబు రామతీర్థం చేరుకున్నారు. కోనేరును పరిశీలించిన ఆయన... వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం తెదేపా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రభుత్వంపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేవుడి సేవ కంటే పవిత్రమైన పని లేదన్నారు. వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ కుళ్లిపోయాయన్న ఆయన... దేవాలయాలపై దాడులు జరగడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. విగ్రహాల ధ్వంసంతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు.

ఉత్తరాంధ్ర అయోధ్యలో రాముడికి అవమానం జరిగిందని వ్యాఖ్యానించారు. తెదేపా హయాంలో ఎప్పుడూ ప్రార్థనా మందిరాలపై దాడులు జరగలేదని చెప్పారు. దేవాలయాలను కాపాడే బాధ్యత ఏపీ సీఎం జగన్‌కు లేదా..? అని చంద్రబాబు ప్రశ్నించారు. రామతీర్థంలో ఏ-2కి ఏం పని దుయ్యబట్టారు.

'రాముడి విగ్రహం ధ్వంసం చేశారని తెలిసి అందరూ బాధపడ్డారు. విగ్రహాలను ధ్వంసం చేసేవాళ్లు పరమ కిరాతకులు. దేవుడి ఆస్తులపై కన్నేస్తే మసైపోతారు.. జాగ్రత్త. దేవాలయాల వద్దకు వెళ్లి క్రైస్తవం ప్రచారం చేస్తారా..? పరమత విద్వేషం ఎందుకని ప్రశ్నిస్తున్నా?. ముఖ్యమంత్రి విజయనగరం వచ్చినా రామతీర్థం ఘటనపై మాట్లాడారా..?. కనీసం ఆలయానికి వచ్చి పరిశీలించాల్సిన బాధ్యత ఆయనకు లేదా..? ఆర్డీవో, తహసీల్దార్‌కు బాధ్యత లేదా..? తప్పుడు కేసులు పెట్టిన అధికారులపై తర్వాత చర్యలు తప్పవు' - చంద్రబాబు, తెదేపా అధినేత

రామతీర్థంపై ఎందుకు మాట్లాడలేదు?

దేవుడిని చూసేందుకు అధికారులు ఏ-2ను ఆమోదించారని, నేను వెళ్తే మాత్రం అడ్డుకున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులను మతం మార్చే ఉద్దేశం చాలా తప్పని ఉద్ఘాటించారు. రామతీర్థం, ఒంటిమిట్ట ఆలయాలకు చారిత్రక ప్రాధాన్యం ఉందని తెలిపారు. 16వ శతాబ్దంలోనే పూసపాటి వంశీయులు రామతీర్థంలో ఆలయాలు నిర్మించారని గుర్తు చేశారు. ఆలయాలపై దాడులు జరుగుతుంటే... హోంమంత్రి, దేవదాయశాఖ మంత్రులు పట్టించుకోరా..? అని నిలదీశారు. కొందరు నేతలు దేవుడి బొమ్మలను కూడా ఎగతాళి చేస్తూ మాట్లాడటం దారుణమన్నారు.

'బైబిల్‌ చదవకుండా నిద్రపోనని ఏపీ సీఎం జగన్‌ అంటారు. ఇతరులకు కూడా విశ్వాసాలు ఉంటాయని జగన్‌కు తెలియదా? హిందూ ఆలయాల భూములు కొల్లగొట్టేందుకు అర్ధరాత్రి జీవోలు ఇచ్చారు. హిందూ ఆలయాలను అపచారం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తిరుమలలో డ్రోన్‌ల వినియోగం దారుణం. పింక్ డైమండ్ వచ్చేవరకు మిమ్మల్ని వదిలిపెట్టం'

-- చంద్రబాబు, తెదేపా అధినేత

ఇదీ చదవండి

నేతల పోటాపోటీ పర్యటనలు..దద్దరిల్లిన రామతీర్థం

Last Updated : Jan 2, 2021, 8:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.