Chandrababu Condolences to Actors Family: తెలుగు చిత్రసీమ ఇద్దరు దిగ్గజ నటులను కోల్పోవడం బాధాకరమని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్లోని కైకాల సత్యనారాయణ, తమ్మారెడ్డి చలపతిరావుల నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. వారి చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
కైకాల సత్యనారాయణ, చలపతిరావులతో వ్యక్తిగతంగానూ, తెలుగుదేశం పార్టీతోనూ ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తన హయాంలో కైకాల పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారని, చలపతిరావు తమ ఇంట్లో మనిషిగా ఎదిగారని వాపోయారు. వారిద్దరి మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్న చంద్రబాబునాయుడు.. కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. చంద్రబాబు వెంట తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని, టీడీపీ సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్, కంభపాటి రాంమోహన్ రావులు హాజరై కైకాల సత్యనారాయణ, చలపతిరావులకు నివాళులర్పించారు. రేపు ఉదయం 9 గంటలకు మహాప్రస్థానంలో తన తండ్రి చలపతిరావు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు రవిబాబు తెలిపారు.
"కైకాల సత్యనారాయణ గారి మరణం బాధాకరం. తెలుగు ఇండస్ట్రీ గొప్ప నాయకుడ్ని కోల్పోయింది. సుమారు 770 సినిమాలు నటించారు. ఒక్క ఎన్టీఆర్‌తో 101 సినిమాలలో నటించారు. ఇది అరుదైన రికార్డు. యమధర్మ రాజు అంటే మనం కైకాలలోనే చూశాం. రాజకీయాలలోకి రావాలంటే ఎంపీగా కూడా పోటీ చేశారు. ఆయన మరణం పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను". - చంద్రబాబునాయుడు, తెలుగుదేశం అధినేత
"తమ్మారెడ్డి చలపతి గారు చనిపోవడం చాలా బాధాకరం ఆయన ఎప్పుడు కూడా..ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి కూడా ఒక కుటుంబ సభ్యుడిగా, చాలా సన్నిహితంగా.. అన్నింటికంటే ఎన్టీఆర్ కుటుంబమే తనకు సర్వస్వంగా తన కుటుంబం కన్నా మిన్నగా చూసుకునేవారు. ఆయన జీవితం ఒక ఆదర్శం, ఎప్పుడూ చిరునవ్వుతో పలకరించేవాడు. దగ్గర దగ్గర 1200 సినిమాల్లో నటించాడు. నాతో కూడా ఎంతో అభిమానంగా ఉండేవాడు ఎంత అభిమానం అంటే..! ఎన్టీఆర్ గారు అతన్ని ఒక ఫ్యామిలీ మెంబర్గా, గౌరవంగా, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా చూసుకునే వారు. నాతో కూడా చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థిస్తూ.. అదే సమయంలో రవి గారిని ఆయన వారసుడిగా అన్ని విధాల ముందుకు పోవాలని తెలియజేస్తూ ఆయనకు కూడా సంఘీభావాన్ని తెలియజేస్తూ భగవంతుడు అన్ని విధాల వారిని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను".- చంద్రబాబునాయుడు, తెలుగుదేశం అధినేత
ఇవీ చదవండి: