ETV Bharat / state

ఆర్థిక అసమానతలు తొలగించే వ్యవస్థ రావాలని చంద్రబాబు ఆకాంక్ష - chandra babu in independence day celebrations

దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్‌లో తెదేపా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గుంటూరు జిల్లాలో పార్టీ అధినేత చంద్రబాబు జాతీయ పతాకాన్ని ఎగరేశారు. ఒకప్పటి పేదరికం నుంచి ఇప్పుడు ప్రపంచ దేశాలతో పోటీపడే స్థాయికి భారత్ ఎదిగిందని బాబు అన్నారు. భవిష్యత్‌లో ప్రపంచంలోనే భారత్‌ను అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు.

chandra babu
తెదేపా జాతీయ భావాలతో ముందుకెళ్లిందన్న చంద్రబాబు
author img

By

Published : Aug 15, 2022, 3:11 PM IST

ఆంధ్రప్రదేశ్‌ గుంటూరు జిల్లాలో నిర్వహించిన స్వాతంత్య్రదిన వేడుకల్లో తెదేపా అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం సందేశం ఇచ్చారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చేందుకు చాలామంది తమ ప్రాణాలను, ఆస్తులను త్యాగం చేశారని.. వారి త్యాగాలను గుర్తుచేసుకుంటూ ముందుకెళ్దామని పిలుపునిచ్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు ఘనంగా జరుపుతున్నామని.. దేశ సేవకు ప్రజలంతా పునరంకితం కావాల్సిన సమయమిదని చంద్రబాబు అన్నారు.

పేదరికం నుంచి.. నేడు ప్రపంచ దేశాలతో పోటీపడే స్థాయికి భారత్ ఎదిగిందని చంద్రబాబు చెప్పారు. రక్షణ రంగంలో ఎంతో పురోభివృద్ధి సాధించామని, సొంతగా ఆయుధాలు తయారు చేసుకునే స్థాయికి చేరామని అన్నారు. స్వాతంత్య్ర స్ఫూర్తిని, క్రమశిక్షణను అందరిలో పెంచాలని, ప్రతి ఒక్కరిలోనూ దేశ భక్తి రగిల్చేలా పనిచేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. విలువలతో కూడిన సమాజం ఏర్పాటుకు కృషిచేయాలని, ఆర్థిక అసమానతలు తొలగించే వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని సూచించారు. నాడు విదేశీ పాలనలో పేదరికం, కరవు కాటకాలు అనుభవించామన్న బాబు.. ఇప్పుడు దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపేందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు.

ప్రపంచంలో మేటైన మేధావులు ఉండే దేశం.. భారతదేశమని అన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు.. ప్రపంచంతో పోటీపడేలా చేశాయని అన్నారు. ప్రస్తుతం నరేంద్ర మోదీ ఎన్నో విషయాల్లో ముందున్నారని చెప్పారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ను కూడా స్మరించుకోవాలని అన్నారు. పేద ప్రజల మేలుకోసమే ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చారని, తెలుగుదేశం ప్రాంతీయ పార్టీ అయినా.. జాతీయ భావాలతో ముందుకెళ్లిందని గుర్తు చేశారు. దేశ సమైక్యత విషయంలో తెదేపా ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. టెలీకమ్యూనికేషన్ రంగంలో మార్పులకు తెదేపా నాంది పలికిందని, విమానాశ్రయాలు, నౌకాశ్రయాల నిర్మాణానికి కృషి చేశామని, తెదేపా చేసిన కృషి కారణంగా ఐటీ రంగం అభివృద్ధి చెందిదని అన్నారు.

అయితే.. అవినీతి అనేది చీడలా మారి నాశనం చేస్తుందని.. అవినీతి ఉన్నచోట అభివృద్ధి శూన్యమని అన్నారు. ప్రజా జీవితం కలుషితమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ డిజిటల్ యుగంలోనూ అవినీతి ఆమోదయోగ్యం కాదని అన్నారు. నదుల అనుసంధానం ఈ దేశంలో చిరకాల వాంఛ అన్న చంద్రబాబు.. నదీ జలాలు సముద్రంలో కలవకుండా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జన్మభూమి అభివృద్ధి కోసం ప్రవాసులు కూడా కృషి చేయాలని కోరారు. అందరూ కలిసి భారతదేశాన్ని నవశకం వైపు నడిపించాలని పిలుపునిచ్చారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.