ETV Bharat / state

ఏపీ సీఎం జగన్​పై దిశ కేసు పెట్టాలి: చంద్రబాబు

author img

By

Published : Mar 13, 2020, 9:17 PM IST

ఆంధ్రప్రదేశ్​ వైకాపా నేతలు కండకావరంతో ప్రవర్తిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యర్థుల ఇంట్లో నేరుగా మద్యం సీసాలు పెడుతున్నారని ఆరోపించారు. మాచర్లలో తెదేపా నేతలపై హత్యాయత్నం చేస్తే... పోలీసులు స్టేషన్‌ బెయిల్ వచ్చే కేసు పెట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇన్ని అరాచకాలు జరుగుతుంటే ఎస్‌ఈసీ పరిశీలకులు ఏం చేస్తున్నారని నిలదీశారు.

ముఖ్యమంత్రి జగన్​పై దిశ కేసు పెట్టాలి: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్​లో వైకాపా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల ముందే వైకాపా నేతలు అరాచకాలు చేస్తున్నారని ఆరోపించారు.

ఆడబిడ్డలకు రక్షణ ఏదీ..?

పుంగనూరులో నామినేషన్ వేసేందుకు వెళ్లిన మహిళను అడ్డుకున్న తీరును చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. బురఖా వేసుకుని వెళ్లినా.. వైకాపా నేతలు లోపలికి రానివ్వడం లేదన్నారు. అదే ఊరిలో మరో మహిళపై దాడి చేసిన దృశ్యాలను మీడియా ముందు ఉంచారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కరవైందని... వైకాపా నేతలపై దిశ చట్టం కింద కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు. వీరిని ప్రోత్సహిస్తున్న సీఎం జగన్‌పైనా దిశ కేసు పెట్టాలన్నారు. రాష్ట్రంలో ఇన్ని జరుగుతున్నా... సీఎం, హోంమంత్రి, డీజీపీ, ఎన్నికల సంఘం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

నేరాలను క్రమబద్ధీకరించారు

రాష్ట్రంలో వైకాపా ఆగడాలు శ్రుతి మించిపోయాయని చంద్రబాబు దుయ్యబట్టారు. తమ ప్రభుత్వ హయాంలో తప్పు చేయడానికి భయపడేవారంతా ఇప్పడు రెచ్చిపోయి నేరాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఏపీ సీఎం జగన్‌... నేరసంస్కృతిని అధికారికంగా మార్చేశారని నిప్పులు చెరిగారు.

అడుగడుగునా వేధింపులు

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే తెదేపా నేతలను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలతో పతనం తప్పదని... ప్రజలు తిరుగుబాటు చేసే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు. పోలీసుల తీరునూ ఆయన తప్పుబట్టారు. తప్పు చేసిన వైకాపా నేతలను వెనుకేసుకొస్తూ... వాటిని ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భయపెట్టి బెదిరించి... దొడ్డిదారిన ఏకగ్రీవం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ.. పోలీసులనూ వాడుకుంటున్నారని ఇది భవిష్యత్‌లో వారికి తలవంపులు తీసుకొస్తుందన్నారు. మద్యం బాటిళ్లను తెలుగుదేశం నేతల ఇళ్లల్లో దొంగచాటున దాచి పెట్టి... కేసులు పెడుతున్నారని... ఇలాంటి దుశ్చర్యల కోసమే దొంగ జీవోలు తీసుకొచ్చారని విమర్శించారు. వైకాపా నేతలు మాత్రం తెలంగాణ నుంచి మద్యం ఇష్టారాజ్యంగా తీసుకొస్తున్నారని ఆరోపించారు.

హత్యాయత్నం చేసిన వ్యక్తికి స్టేషన్‌ బెయిలా

మాచర్లలో తెదేపా నేతలపై హత్యాయత్నం చేసిన వ్యక్తికి స్టేషన్ బెయిల్‌ ఇవ్వడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. ఇదేనా బాధ్యతని పోలీసు అధికారులను ప్రశ్నించారు. ఇళ్లపై డ్రోన్‌ ఎందుకు ఎగరవేశారని ప్రశ్నిస్తే 8 రోజులు జైలులో పెట్టారని... ఎంపీ గల్లా జయదేవ్‌పైనా కేసులు పెట్టారని గుర్తు చేశారు. చట్టం కొందరికి చుట్టం.. మరికొందరికి శాపంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని అరాచకాలు జరుగుతుంటే ఎస్‌ఈసీ పరిశీలకులు ఏం చేస్తున్నారని నిలదీశారు. తాము చేసిన ఫిర్యాదులు పట్టించుకోని అధికారులు... రాష్ట్రంలో ఎన్నికలు ఎలా నిర్వహిస్తున్నారన్నారు.

ప్రజలే తెదేపా అభ్యర్థులు

అందరికీ ఒకటే చట్టం ఉందని.. జగన్‌కు ప్రత్యేక చట్టం లేదని... ఎవరు తప్పు చేసినా చట్టం ముందు తలవంచాల్సిందేనన్నారు చంద్రబాబు. భయపెట్టి.. కొన్ని పురపాలికల్లో అసలు పోటీ లేకుండా చేశారని.. మాచర్లే అందుకు ఉదాహరణ అన్నారు. డోన్‌, తాడిపత్రిలో వీరంగం సృష్టించారని ధ్వజమెత్తారు. 90 శాతం గెలవాలనే సీఎం పిలుపుతోనే ఇన్ని అరాచకాలు చేస్తారా అని నిలదీశారు. దమ్ముంటే నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపించాలని... అప్పుడు వచ్చే ప్రజా తీర్పును తాము గౌరవిస్తామని అన్నారు. తమకు అభ్యర్థులు దొరకడం లేదని ఎద్దేవా చేస్తున్నారని... ప్రజలే తమ పార్టీ అభ్యర్థులని స్పష్టం చేశారు.

కరోనా కంటే జగన్‌ వైరస్‌ భయంకరమైనది

కరోనా కంటే భయకరమైన వైరస్‌.. జగన్ వైరస్‌ అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ సర్వనాశనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ప్రజలు పూర్తిగా చైతన్యవంతులైతే తప్ప ఈ రాష్ట్రానికి న్యాయం జరగదని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో స్థానిక ఎన్నికల పరిస్థితిపై హోంమంత్రికి భాజపా ఎంపీల లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.