మధ్యప్రదేశ్ ఆగ్నేయ ప్రాంతంలో 900 మీటర్ల ఎత్తులో గాలులతో ఉపరితల ఆవర్తనం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మంగళవారం అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది.
ఈ వేసవి ఆరంభంలో తొలిసారి సోమవారం మంచిర్యాల జిల్లా నీల్వాయిలో 40.4, జన్నారంలో 40.1, వాజేడు(ములుగు)లో 39.2, కోల్వాయి(జగిత్యాల)లో 39.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం నుంచి ఎండవేడి తీవ్రత క్రమంగా పెరుగుతుందని, గాలిలో తేమ 18 శాతం వరకూ అదనంగా ఉందని వాతావరణశాఖ తెలిపింది.