Dharna on the issues of transport workers : ఆటో, క్యాబ్ ఛార్జీలను పెంచకపోవడంతో పాటు రవాణారంగ కార్మికుల సమస్యల పట్ల వివక్షత చూపిన బీఆర్ఎస్ను చిత్తుగా ఓడిస్తామని తెలంగాణ మోటార్ ట్రాన్స్పోర్ట్ యూనియన్ హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు వందశాతం పెరిగినా ఇప్పటి వరకూ కేసీఆర్ ప్రభుత్వం ఆటో,క్యాబ్ ఛార్జీలను పెంచలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
మోటార్ ట్రాన్స్పోర్ట్ యూనియన్ నాయకులు హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గ్రీన్, క్యాటర్లీ ట్యాక్స్‌ల పేరిట ప్రభుత్వం తమ నుంచి దోచుకోవడం ఆపాలని కోరారు. ప్రభుత్వం టాక్స్‌లను తగ్గిస్తామని చెప్పినా ఇంతవరకూ అది కార్యరూపం దాల్చలేదన్నారు. ఓలా, రాపిడో, ఊబర్ సంస్థలు 30 శాతం కమీషన్లను నొక్కి డ్రైవర్లను లూటీ చేస్తున్నాయని యూనియన్ నాయకులు ఆరోపించారు. వాటిని తక్షణమే నిషేధించాలని కోరారు.
Chalo Indira Park program on 15th of this month : ఇప్పటి వరకూ లెక్కలేనన్ని పోరాటాలు, ధర్నాలు చేసినా దిక్కులేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ఇంధన, నిత్యావసర వస్తువుల అధిక ధరలతో చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఆటో ఫైనాన్సియర్ల వేధింపులతో రవాణారంగ కార్మికులు అష్టకష్టాలు పడుతున్నామని తెలిపారు. చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడి తమ ప్రాణాలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రవాణారంగ కార్మికులకు సంక్షేమబోర్డు ఏర్పాటు చేయాలని కోరారు.
ప్రమాద బీమాను రూ.5లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచి సాధారణ మరణాలకు, అంగవైకల్యానికి కూడా వర్తింపజేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రవాణారంగ కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈనెల 15న వేలాదిమంది కార్మికులతో "చలో ఇందిరాపార్క్" కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. డ్రైవర్ల హక్కుల సాధనే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం అని వెల్లడించారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించేదిశగా నిర్ణయం తీసుకోవాలని యూనియన్ నాయకులు కోరారు. కార్యక్రమంలో తెలంగాణ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు బైరగోని రాజుగౌడ్, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
కనీసం వేతనం పెంచాలని ప్రభుత్వాసుపత్రుల్లోని ఒప్పంద కార్మికుల ఆందోళన