వేతన సవరణ సహా పలు సమస్యల సాధన కోసం ఈనెల 13న ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల, ఒప్పంద ఉద్యోగుల ఐకాస తెలిపింది. ఈ అంశంపై ఐకాస ప్రతినిధులు బీఆర్కే భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్కు నోటీసు ఇచ్చారు.
లక్షలాది మంది ఉద్యోగులు వేతన సవరణ కోసం ఎదురు చూస్తున్నారని ఐకాస ప్రతినిధులు తెలిపారు. ఒప్పంద కార్మికులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని... ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రభుత్వానికి తమ సమస్యలు విన్నవించేందుకే మార్చి 13న ఛలో అసెంబ్లీ చేపడుతున్నట్లు నోటీసులో పేర్కొన్నారు.
ఇదీ చూడండి : షాకింగ్.. అందరూ చూస్తుండగానే ప్లై ఓవర్ మీది నుంచి దూకి ఆత్మహత్య