పెద్దోళ్లకు కరోనా వస్తే ఎటువంటి వైద్యం అందిస్తున్నారో పేదలకు సైతం అదే తరహా వైద్యం అందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి కోరారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్ రావడం... ఉత్తరప్రదేశ్లో ఓ మహిళా మంత్రి కరోనాతో చనిపోవడం బాధాకరమన్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రపంచ, దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ఎంత విజృంభిస్తోందో అర్థమవుతుందన్నారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కరోనా పాజిటివ్ కేంద్రానికి వెళ్లి భరోసా కల్పించినందుకు చాడ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కేంద్రం నుంచి రాష్టానికి ఎక్కువ నిధులు మంజూరు చేసే విధంగా కృషి చేయాలని కోరారు. సీఎం కేసీఆర్ తండ్రి లాగా ప్రజలకు భరోసా కల్పించాలన్నారు. ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడంతోపాటు హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోరారు.
ఇదీ చూడండి : 'కరోనా చికిత్సకు పదివేలే అవుతాయనడం హాస్యాస్పదం'