ETV Bharat / state

దేశ చరిత్రలో నిజామాబాద్​ ఎన్నికలు ఓ మైలురాయి - CEO MEETING ON NIZAMABAD

రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికల నిర్వహణపై సీఈసీ బృందం ప్రత్యేక దృష్టి సారించింది. తొలిసారి ఈవీఎంలను తయారు చేసిన ఘనత హైదరాబాద్​ సొంతమైతే... ఇంత ఎక్కువ సంఖ్యలో ఈవీఎంలను వాడటం దేశ ఎన్నికల చరిత్రలో మరో మైలురాయి అని డిప్యూటీ ఎన్నికల కమిషనర్​ ఉమేష్​ సిన్హా తెలిపారు.

ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష
author img

By

Published : Apr 2, 2019, 2:41 PM IST

Updated : Apr 2, 2019, 4:25 PM IST

ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష
దేశ చరిత్రలో అత్యధికంగా ఈవీఎంలను ఉపయోగించి పోలింగ్‌ నిర్వహించటం ఇదే మొదటిసారని డిప్యూటీ ఎలక్షన్​ కమిషనర్​ ఉమేష్​ సిన్హా తెలిపారు. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో హైదరాబాద్​లో సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా నిజామాబాద్​ పార్లమెంటు ఎన్నికల నిర్వహణపై చర్చించారు. నియోజకవర్గంలో పోలింగ్​ను సజావుగా జరిపేందుకు 600 మంది నిపుణులను కేటాయిస్తున్నట్లు ఉమేష్​ సిన్హా వివరించారు. నిజామాబాద్​, జగిత్యాల జిల్లాల్లో మొత్తం 1788 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. 25 వేల బ్యాలెట్​ యూనిట్లు, 2వేల కంట్రోల్​ యూనిట్లు , 2వేల వీవీప్యాట్లు సిద్ధం చేస్తున్నట్లు సిన్హా తెలిపారు.

ఇవీ చూడండి:రాష్ట్ర వ్యాప్తంగా 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

Last Updated : Apr 2, 2019, 4:25 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.