కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ వశిష్ఠ నేతృత్వంలోని కేంద్ర బృందం హైదరాబాద్ దిల్‌ఖుషా అతిథిగృహంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని కేంద్రమంత్రికి వివరించారు. వరద నష్టంపై సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కేంద్ర బృందాన్ని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి నష్టానికి సబంధించి సమగ్ర నివేదిక అందలేదని కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ వశిష్ఠ.. మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సాయంత్రం సీఎస్‌ను కేంద్ర బృందం కలవనుంది. ఎమర్జెన్సీ రిలీఫ్ కింద స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ నిధులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలని మంత్రి కిషన్ రెడ్డి కోరారు.
ఇదీ చదవండి: వరద ముంపు ప్రాంతాల్లో రెండో రోజు కేంద్ర బృందం పర్యటన