ETV Bharat / state

ఆస్పత్రుల్లో సిబ్బందిని యుద్ధప్రాతిపదికన నియమించాలి:కిషన్​ రెడ్డి

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు ఆక్సిజన్​ ప్లాంట్లు మంజూరు చేస్తున్నట్లు కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్​ గాంధీ ఆస్పత్రిలో ఉన్న బాధితులను కలిసి పరామర్శించారు. అన్ని ఆస్పత్రుల్లో యుద్ధప్రాతిపదికన సిబ్బందిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

central minister kishan reddy
గాంధీ ఆస్పత్రిని సందర్శించిన కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి
author img

By

Published : May 18, 2021, 3:53 PM IST

గాంధీ ఆస్పత్రిలో రెండు ప్లాంట్ల ద్వారా నిమిషానికి రెండు వేల లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతోందని కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్​ గాంధీ ఆస్పత్రిలో కరోనా బాధితులను పరామర్శించి వారిలో ధైర్యం నింపారు. మానసిక ధైర్యంతో కొవిడ్​ను జయించవచ్చని సూచించారు. కొవిడ్ నుంచి కోలుకున్న 110 సంవత్సరాల రామనంద తీర్థను ఆయన పరామర్శించారు. అన్ని ఆస్పత్రుల్లో యుద్ధప్రాతిపదికన వైద్య సిబ్బందిని భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జూనియర్ డాక్టర్లకు, వారి కుటుంబ సభ్యులకు నిమ్స్ ఆసుపత్రిలో వైద్యం అందించాలని ఆయన కోరారు

అనంతరం ఆక్సిజన్ ప్లాంట్, కరోనా బాధితుల కోసం కొత్తగా ఏర్పాటుచేసిన బ్లాక్​ను ఆయన పరిశీలించారు. అన్ని జిల్లాల్లోనూ ఆక్సిజన్ ప్లాంట్లను మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గాంధీ ఆసుపత్రిలో మరో వారం రోజుల్లోగా రోగులకు 300 పడకలు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. జూనియర్ డాక్టర్లు ఈ సమయంలో సమ్మె చేయడం సరికాదని.. చర్చల ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బ్లాక్ ఫంగస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిందని అన్నారు.

ఇదీ చూడండి: మరోసారి పరస్పర విమర్శలకు దిగిన ఈటల, గంగుల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.