ETV Bharat / state

'కరోనా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు' - భారతదేశంలో కరోనా వైరస్

కరోనా గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే కరోనా నివారణ చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. కరోనా పరీక్ష కోసం ఎవరూ రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

central-minister-kishan-reddy-talk-about-corona-virus-in-delhi
'కరోనా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు'
author img

By

Published : Mar 20, 2020, 11:15 AM IST

Updated : Mar 20, 2020, 11:25 AM IST

'కరోనా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు'

కరోనా నివారణ చర్యలు ఇప్పటికే ప్రారంభించామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అనేక సూచనలు చేశామని స్పష్టం చేశారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారికి వైద్యసేవలు అందిస్తున్నామని తెలిపారు. జనవరి 22 నుంచి ఇప్పటివరకు 22 సమావేశాలు నిర్వహించినట్లు వెల్లడించారు. జనవరి 27నుంచి రాష్ట్రాల ఆరోగ్యశాఖ కార్యదర్శులతో పలుసార్లు మాట్లాడామని వివరించారు.

65 నౌకాశ్రయాల వద్ద స్క్రీనింగ్

ప్రతిరోజూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్రమంత్రి రాష్ట్రాలతో సమావేశం అవుతున్నారని చెప్పారు. కరోనా పరిస్థితిపై కేంద్రమంత్రి పార్లమెంటులో ప్రకటన కూడా చేశారన్నారు. సరిహద్దు దేశాల వద్ద కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. కరోనా నివారణకు ఇతర దేశాల్లో తీసుకున్న చర్యలపై ఎప్పటికప్పుడూ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. విదేశాల నుంచి వచ్చేవారిని 28 రోజులపాటు పర్యవేక్షిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఓడల ద్వారా వచ్చే సరకు రవాణాను నిషేధించామని వెల్లడించారు. 65 నౌకాశ్రయాల వద్ద స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. కరోనా నివారణకు ప్రైవేటు ఆస్పత్రుల సేవలనూ వినియోగించుకుంటున్నామని అన్నారు.

ప్రత్యేక నిధి ఏర్పాటు దిశగా ప్రభుత్వం

కరోనా నెగిటివ్ వస్తే డిశ్చార్జి బాధ్యతలు వైద్యులే తీసుకోవాలని సూచించారు. కరోనా లేదని పూర్తి నివేదిక వచ్చాకే డిశ్చార్జి చేయాలని ఆదేశించారు. కరోనా బాధిత దేశాల నుంచి వచ్చినవాళ్లు క్వారంటైన్‌ కేంద్రానికి వెళ్లాలని కోరారు. సార్క్ దేశాలతో సంప్రదించి ప్రత్యేక నిధి ఏర్పాటు దిశగా ప్రధాని ప్రయత్నం చేస్తున్నారన్నారు. పనిప్రదేశాల్లో పరిశుభ్రత పాటించాలని సూచించారు.

ఒక్కరూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు

కరోనాకు చికిత్స తీసుకుని 20 మందికి పైగా డిశ్చార్జి అయ్యారని ప్రకటించారు. కరోనాతో ఇప్పటివరకు నలుగురు మాత్రమే చనిపోయారని... ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మిగతా విద్యాసంస్థల మూసివేతపైనా సమీక్ష చేస్తున్నట్లు చెప్పారు. కరోనా పరీక్ష కోసం ఎవరూ రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మరిన్ని కరోనా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కరోనా పరీక్షా కేంద్రాల విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సాయం కోరినట్లు కేంద్రమంత్రి కిషన్​రెడ్డి వివరించారు.

ఇదీ చదవండి: కరోనా ఎఫెక్ట్: నిర్మానుష్యంగా మారిన కరీంనగర్

Last Updated : Mar 20, 2020, 11:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.