కేంద్ర ప్రభుత్వం డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం ఉపయోగించి ఆక్సిజన్, వ్యాక్సిన్లను అన్ని రాష్ట్రాలకు అందుబాటులో ఉంచడానికి చర్యలు తీసుకుందని కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వెంటిలేటర్లు, ఆక్సిజన్ ప్లాంట్లను తెలంగాణకు అవసరమైన మేరకు అందించామని వెల్లడించారు. ఇప్పటి వరకు పీఎం కేర్ నుంచి 1,400 వెంటిలేటర్లు అందించామని... రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటి కూడా కొనుగోలు చేయలేదని పేర్కొన్నారు. మంచి జరిగితే కల్వకుంట్ల కుటుంబం గొప్పగానూ... చెడు జరిగితే మోదీపై నెట్టడం తెరాసకి అలవాటుగా మారిందిని విమర్శించారు.
దిల్లీలో ఇంఛార్జీ మంత్రిగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎంపీగా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో లక్షా 50 వేల కేజీల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. 80 లక్షల కుటుంబాలకుపైగా ఉన్న రేషన్ లబ్ధిదారులకు మే, జూన్ రెండు నెలలకు కలిపి పది కేజీల బియ్యం అదనంగా ఇస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: VH: పీసీసీ పదవి బలహీన వర్గాలకే ఇవ్వాలి: వీహెచ్