ETV Bharat / state

KISHAN REDDY MEETS VH: అంబేడ్కర్​ విగ్రహ ఏర్పాటుపై కేసీఆర్​కు లేఖ రాస్తా: కిషన్​ రెడ్డి - central minister kishan reddy met congress senior leader v hanumantha rao

పంజాగుట్టలో బీఆర్​ అంబేడ్కర్​ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్​ రెడ్డి(KISHAN REDDY) డిమాండ్​ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్(CM KCR)​కు లేఖ రాస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్​ సీనియర్​ నేత వీహెచ్​(VH)ను.. అంబర్​పేట్​లోని ఆయన నివాసంలో కిషన్​ రెడ్డి కలిశారు. ఆయనను పరామర్శించారు.

KISHAN REDDY MEETS VH
వీహెచ్​ను కలిసిన కిషన్​ రెడ్డి
author img

By

Published : Sep 5, 2021, 4:58 PM IST

రాష్ట్ర ప్రభుత్వానికి దళితుల ఓట్లు కావాలి కానీ.. వారి ఆత్మగౌరవం వద్దా అని కాంగ్రెస్​ సీనియర్​ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. రాష్ట్రంలో రాజ్యాంగ నిర్మాత బీఆర్​ అంబేడ్కర్​ విగ్రహాన్ని కూలగొడితే.. పట్టించుకునే వారే లేరని.. కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డితో వీహెచ్​ ఆవేదన వ్యక్తం చేశారు. వీహెచ్​ను కిషన్​ రెడ్డి.. హైదరాబాద్​ అంబర్​పేట్​లోని ఆయన నివాసంలో కలిసి పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

కిషన్​కు వీహెచ్​ విజ్ఞప్తులు

అంబేడ్కర్​ విగ్రహం మూడేళ్ల నుంచి పోలీస్​ స్టేషన్​లోనే ఉంటుందని.. ఆ విషయం గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని వీహెచ్​.. కిషన్​ రెడ్డితో అన్నారు. ఆ విగ్రహాన్ని పీఎస్​ నుంచి బయటకు తేవాలని కేంద్ర మంత్రిని కోరారు. అంబర్​పేట్​ నియోజకవర్గంలో గతంలో మహాత్మ జ్యోతిరావు పూలే ఆడిటోరియం నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు వీహెచ్​ పేర్కొన్నారు. రెవెన్యూ ఇబ్బందులతో ఆడిటోరియం.. నిర్మాణానికి నోచుకోలేదని కిషన్​ రెడ్డితో అన్నారు. ఆడిటోరియం నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కేంద్ర మంత్రిని కోరారు.

ప్రభుత్వం ముందుకు వస్తే నిధులు ఇస్తా

వీహెచ్​ విజ్ఞప్తిపై కిషన్​ రెడ్డి స్పందించారు. అంబర్​పేట్​ చే నంబరు రోడ్డులో జ్యోతిరావు పూలే స్మారక కేంద్రం విషయంలో సీఎం కేసీఆర్​తో చర్చించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కిషన్​ చెప్పారు. ఆడిటోరియం నిర్మాణానికి ప్రభుత్వం ముందుకు వస్తే తన ఎంపీ ల్యాడ్స్​ నుంచి నిధులు ఇస్తానని హామీ ఇచ్చారు. అదే విధంగా పంజాగుట్టలో అంబేడ్కర్​ విగ్రహం ఏర్పాటు చేయాలని కిషన్​ డిమాండ్​ చేశారు. ఈ అంశంపై కేసీఆర్​కు లేఖ రాస్తానని చెప్పారు.

ఇదీ చదవండి: Uttam kumar reddy on trs: 'తెరాస ప్రభుత్వంలో మహిళలకు తీవ్ర అన్యాయం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.