ETV Bharat / state

Kishan Reddy Comments: 'రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు రాబోతోంది' - kishan reddy making an interesting comments

రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు రాబోతోందని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి (Kishan Reddy Comments) జోస్యం చెప్పారు. హుజూరాబాద్ బై ఎలక్షన్ కీలక మార్పులు తీసుకురాబోతోందన్నారు. ఈటల నిజాయతీతో పనిచేశారని కొనియాడారు.

Reddy
కిషన్
author img

By

Published : Nov 6, 2021, 8:49 PM IST

'రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు రాబోతోంది'

అబద్ధాలు చెప్పడంలో ముఖ్యమంత్రి కేసీఆర్​కు వెన్నతో పెట్టిన విద్య అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy Comments) విమర్శించారు. రాష్ట్ర రాజకీయాల్లో హుజూరాబాద్​ బై ఎలక్షన్ కీలక మార్పులు తీసుకొస్తుందన్నారు. హుజూరాబాద్ ప్రజలు సీఎం కేసీఆర్... మాటలు నమ్మలేదన్నారు. నీతి, నిజాయతీకి ప్రతిరూపంగా ఈటల పని చేశారని కొనియాడారు. ఈటల రాజేందర్ సతీమణి జమున విస్తృతంగా ప్రచారం చేశారని ప్రశంసించారు. హుజూరాబాద్ ఆడ బిడ్డలకు పేరు పేరున నమస్కరిస్తున్నానని తెలిపారు.

హుజూరాబాద్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు దళిత బంధు పథకం వచ్చింది. తెరాస కుటుంబ పాలనకు వ్యతిరేకంగా కవులు, కళాకారులు, మేధావులు పని చేశారు. హనుమకొండలో విజయగర్జన కాదు కల్వకుంట్ల గర్జన పెట్టుకోండి. తెలంగాణ వచ్చింది.. కేసీఆర్ కుటుంబం వల్ల కాదు. తెలంగాణ వ్యతిరేక శక్తులు ప్రగతి భవన్​లో ఉన్నాయి. నిజమైన ఉద్యమకారులకు ఉద్వాసన పలుకుతున్నారు. ఉద్యమకారులు తెరాసలో ఉండటానికి ఇష్టపడటం లేదు. ఉద్యమకారులు, కవులు, కళాకారులు, మేధావులు భాజపాలోకి రావాలని ఆహ్వానం పలుకుతున్నాం. కుటుంబ పాలనకు చరమగీతం పాడండి. తెలంగాణ ప్రజలు డబ్బులకు లొంగరని నిరూపించారు.

-- కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.