ETV Bharat / state

రాచకొండ పోలీసులకు కేంద్ర మంత్రి ప్రశంస - రాచకొండ పోలీసులను ప్రశంసించిన కేంద్ర మంత్రి కిరణ్​ రిజుజు

రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో.. మణిపూర్‌ యువకులను విదేశీయులుగా భావించి సూపర్‌ మార్కెట్లోనికి అనుమతించని వ్యవహారంపై పోలీసుల స్పందన పట్ల కేంద్ర మంత్రి కిరణ్​ రిజుజూ అభినందించారు. పోలీసులు స్పందించిన తీరు మానవత విలువలకు అద్దం పడుతుందని ట్విట్‌ చేశారు.

Central Minister kiran rijuju Appreciate Rachakonda Police
రాచకొండ పోలీసులకు కేంద్ర మంత్రి ప్రశంస
author img

By

Published : Apr 11, 2020, 8:57 AM IST

రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో.. మణిపూర్‌ యువకులను విదేశీయులుగా భావించి సూపర్‌ మార్కెట్లోనికి అనుమతించని వ్యవహారంపై కేంద్ర మంత్రి కిరణ్​ రిజుజూ స్పందించారు. సదరు దుకాణ యజమానిపై చర్యలు తీసుకున్న రాచకొండ పోలీసులను కేంద్ర మంత్రి అభినందించారు.

వనస్థలిపురంలో ఇద్దరు మణిపూర్‌ యువకులను సూపర్‌మార్కెట్‌ సిబ్బంది లోపలికి అనుమతించలేదు. ఆ విషయాన్ని బాధితులు రాచకొండ పోలీసు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. సీపీ మహేశ్​ భగవత్‌ ఆదేశాల మేరకు.. సూపర్‌మార్కెట్‌ సిబ్బంది ముగ్గురిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

అనంతరం సీపీ బాధితులతో మాట్లాడి వారికి బియ్యం, నిత్యవసరాలు అందజేశారు. రాచకొండ పోలీసులు స్పందించిన తీరు మానవతా విలువలకు అద్దం పడుతుందని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజుజూ అభినందిస్తూ ట్విట్‌ చేశారు.

ఇవీచూడండి: లాక్​డౌన్​ అజెండాగా నేడు మంత్రివర్గ సమావేశం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.