ETV Bharat / state

Review On Bifurcation: విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ కీలక సమావేశం

author img

By

Published : Jan 12, 2022, 12:46 PM IST

Updated : Jan 12, 2022, 8:21 PM IST

Review On Bifurcation: ఏపీ, తెలంగాణల మధ్య విభజన సమస్యలపై ఇరు రాష్ట్రాల సీఎస్​లు, ఉన్నతాధికారులతో కేంద్ర హోం శాఖ సమావేశం నిర్వహించింది. ఇరు రాష్ట్రాల మధ్య విభజనాంశాలు, చట్టంలో పొందుపరిచిన అంశాలపై సమీక్షలో చర్చించారు. హైదరాబాద్​ బీఆర్కే భవన్​ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా సీఎస్​ సోమేశ్​ కుమార్​, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Review On Bifurcation
ఏపీ, తెలంగాణ విభజన సమస్యలు

Review On Bifurcation: విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ సమావేశం ముగిసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా దృశ్యమాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్ నుంచి సీఎస్​​ సోమేశ్ కుమార్​ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యల పరిష్కారంపై సమీక్షించారు.

ఈ సమావేశంలో ప్రధానంగా తొమ్మిది అంశాలపై చర్చ జరిగింది. సింగరేణి అనుబంధ సంస్థ ఆప్మెల్, దిల్లీలో ఏపీ భవన్ విభజనపై అధికారులు చర్చించారు. విభజన చట్టం 9, 10 షెడ్యూళ్లలోని సంస్థలు, విద్యుత్ బకాయిలు, పన్ను చెల్లింపులు, రిఫండ్‌ అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిపారు. బ్యాంకు ఖాతాల్లో నగదు పంపకాలు, విభజన చట్టంలో పేర్కొనని సంస్థల విభజనపైనా చర్చ జరిగింది. ఏపీ జెన్​కోకు తెలంగాణ డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలపై చర్చకు తీసుకువచ్చారు.

ఇదీ చదవండి: "ఏపీలో థియేటర్ల సమస్యపై ఆ రాష్ట్ర మంత్రులతో మాట్లాడుతా"

Last Updated : Jan 12, 2022, 8:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.