పర్యాటక యాత్రలకు కేంద్రం ఊతమిస్తోంది. భారత్ దర్శన్, దేఖో అప్నా దేశ్ ఇలా వివిధ పథకాలు, పేర్లతో శ్రీకారం చుట్టింది. ప్రత్యేక రైళ్లను కేటాయించింది. దేశీయ పర్యటనలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ.. కొన్నింటికి విమానాలనూ వినియోగించుకోవచ్చని ఐఆర్‌సీటీసీకి దిశానిర్దేశం చేసింది.
సికింద్రాద్ నుంచి
- జగన్నాథ్ దామ్ యాత్ర.. మార్చి 5నసికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ప్రారంభమవుతుంది. పురి, భువనేశ్వర్, కోణార్క్‌ల సందర్శన ఉంటుంది. రూ.5250 టికెట్ ధర .
- రామాయణ యాత్ర పేరిట అయోధ్య నుంచి చిత్రకూట్ యాత్ర మార్చి 16న సికింద్రాబాద్ నుంచి ప్రారంభమౌతుంది. అయోధ్య, చిత్రకూట్, గయ, నందిగ్రామ్, ప్రయాగ్, వారణాసి సందర్శన ఉంటుంది. టికెట్ ధర రూ.11395.
నగరం నుంచి విమానయాత్రలు
- మధ్యప్రదేశ్ మహాదర్శన్ పేరుతో ఈనెల 27 నుంచి విమానంలో యాత్ర ప్రారంభమవుతుంది. ఇండోర్, మహేశ్వర్, ఓంకారేశ్వర్, ఉజ్జయిని చూడొచ్ఛు టిక్కెట్:రూ.18950.
- సౌరాష్ట్ర యాత్రలో అహ్మదాబాద్, ద్వారక, సోమనాథ్ గుడి, స్టాచూ ఆఫ్ యూనిటీ సందర్శించొచ్ఛు టిక్కెట్:రూ.23,300.
- సౌత్‌గోవా, నార్త్ గోవా సందర్శన టిక్కెట్: రూ.16,270.
శ్రీనగర్ వరకు వెళితే...
- శ్రీనగర్‌తోపాటు గుల్‌మార్గ్, జమ్ము, కత్రా, పహల్గామ్, సోన్‌మార్గ్ సందర్శనకు టిక్కెట్ రూ.16900.
- పై ప్రదేశాలతో కలిపి మాతా వైష్ణోదేవి యాత్రకు రూ.14760 చెల్లించాలి.
- మాతావైష్ణోదేవి యాత్రతో పాటు కశ్మీర్ పర్యటనకు రూ.13750 టిక్కెట్ ధర.
- గుల్‌మార్గ్, పహల్గామ్, సోన్‌మార్గ్, శ్రీనగర్ యాత్రకు రూ.9885.
హైదరాబాద్ నుంచి..
వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చిన వారికి స్థానికంగా ఐఆర్‌సీటీసీ యాత్రలు నిర్వహిస్తోంది. నగరం, రామోజీ ఫిల్మ్ సిటీ సందర్శనకు రూ.3845 టిక్కెట్ ధర.
- సోమవారం, శుక్రవారం మినహా నగర సందర్శనకు రూ.1115, హెరిటేజ్ హైదరాబాద్ ఒక రోజు యాత్రకు రూ.1170 టిక్కెట్ ధర నిర్ణయించారు.
- హైదరాబాద్, శ్రీశైలం, రామోజీ ఫిల్మ్ సిటీ సందర్శనకు (సోమవారం, శుక్రవారం మినహా) రూ.8970 టిక్కెట్ ధర.
వారణాసి నుంచి..
- వారణాసి నుంచి మొదలయ్యే కాశీ యాత్రలో సార్‌నాథ్, వారణాసిని చూడొచ్ఛు టిక్కెట్ రూ.5810.
- వారణాసి నుంచి ఉత్తరప్రదేశ్ ఆధ్యాత్మిక యాత్రల పేరిట కూడా కొన్ని ప్రవేశపెట్టారు.
పూర్తి వివరాలకు..
www.irctc.com చూడొచ్చు. 04027702401/07, 27808899 నంబర్లలోనూ సంప్రదించవచ్చు.