దేశంలోని పలు సేవా సంస్థలు, ఎన్జీవోలకు భారత ఆహారసంస్థ ద్వారా కేంద్రం ఆహార ధాన్యాలు తక్కువ ధరకు అందించనుంది. ఈమేరకు భారత ఆహార సంస్థ తెలంగాణ ప్రాంత జనరల్ మేనేజర్ అశ్వనీ కుమర్ గుప్తా తెలిపారు. ఈ పథకంలో భాగంగా ఎఫ్‌సీఐ ఓపెన్ మార్కెట్ సేల్స్ కింద సేవా సంస్థలకు, సహాయ శిబిరాలు నిర్వహించే ఎన్జీవోలకు, కమ్యూనిటీ కిచెన్లకు బియ్యం కిలో రూ.22 చొప్పున, గోధుమలు కిలో రూ.21 చొప్పున అమ్మడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్లు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారని తెలిపారు. ఆసక్తి గల ఎన్జీవోలు, సేవాసంస్థలు సంబంధిత కలెక్టర్ కార్యాలయాల్లో తమ సంస్థల ధృవీకరణ పత్రాలు, ఉద్దేశం, అవసరమైన ధాన్యం పరిమాణం వివరాలు తెలిజేయాలన్నారు. కనిష్ఠంగా ఒక టన్ను, గరిష్ఠ పరిమితి లేదని, ఏ డిపో నుంచి ధాన్యం పొందగోరుచున్నారో తదితర వివరాలతో కూడిన దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుందన్నారు.
ఇదీ చూడండి: జోరుగా ఉపాధి హామీ పనులు.. ప్రతి రోజూ 50వేలకు పైనే