ETV Bharat / state

తెలుగు రాష్ట్రాలకు పోలీస్​ అధికారుల కేటాయింపు

కేంద్రం తెలుగు రాష్ట్రాలకు పోలీస్ అధికారుల తుది కేటాయింపు నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్​ పునర్విభజన చట్టం ప్రకారం 52:48 శాతం మేరకు అధికారుల కేటాయింపులు జరిగాయి. గతంలో జరిగిన కేటాయింపుల విషయంలో కొంతమంది పోలీస్ అధికారులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో తాజాగా తుది నిర్ణయం తీసుకున్నారు.

central government Allocation of Police Officers to Telugu States
తెలుగు రాష్ట్రాలకు పోలీస్​ అధికారుల కేటాయింపు
author img

By

Published : Oct 28, 2020, 10:20 PM IST

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం పోలీస్ అధికారుల తుది కేటాయింపు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం అధికారుల కేటాయింపులు జరిగాయి. ఇందులో నాన్ కేడర్ ఎస్పీ, అదనపు ఎస్పీ, డీఎస్పీలను కేటాయించింది. గతంలో జరిగిన కేటాయింపుల విషయంలో కొంతమంది పోలీస్ అధికారులు హైకోర్టును ఆశ్రయించడం వల్ల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని కేటాయింపులు చేయాలని హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.

ఆ మేరకు 52:48 శాతం ప్రకారం కేటాయింపులు నిర్ణయించింది. కేంద్ర కేటాయింపుల ప్రకారం ఆంధ్రప్రదేశ్​కు నాన్ కేడర్ ఎస్పీలు-16మంది, అదనపు ఎస్పీలు 64 మంది, డీఎస్పీలు 302 మందిని కేటాయించారు. తెలంగాణకు నాన్ కేడర్ ఎస్పీలు 9 మంది, అదనపు ఎస్పీలు 49 మంది, డీఎస్పీలు 192 మందిని ఇచ్చారు.

ప్రస్తుత కేటాయింపుల్లోనూ ఏపీకి చెందిన వాళ్లు తెలంగాణలో ఉండటం వల్ల పదోన్నతుల విషయంలో అన్యాయం జరుగుతుందని కొంతమంది పోలీస్ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. నాన్ కేడర్ ఎస్పీ, అదనపు ఎస్పీల్లో కొంతమంది ఏపీ వాళ్లున్నారని... దీనివల్ల తెలంగాణ అధికారులకు సీనియార్టీ, పదోన్నతుల విషయంలో అన్యాయం జరుగుతోందని తెలంగాణ పోలీసు అధికారులు ఆవేదన చెందుతున్నారు.

ఇదీ చూడండి : విధుల్లో అనైతికంగా ఉన్న ముగ్గురు కానిస్టేబుళ్లు సస్పెండ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.