65 టోల్‌ప్లాజాల్లో..
గత నెల15 నుంచి.. దేశవ్యాప్తంగా టోల్ చెల్లింపులను ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో వసూలు చేసే విధానాన్ని చేపట్టారు. దేశవ్యాప్తంగా 65 టోల్‌ప్లాజాల పరిధిలో నగదు వసూళ్లు అధికంగా ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. ఆ మార్గాల్లో వాహనదారులకు అసౌకర్యం లేకుండా.. నెలపాటు హైబ్రీడ్ వరసలకు అనుమతినిచ్చింది.
రాష్ట్రంలో రెండింటికి..
రాష్ట్రంలోని హైదరాబాద్- విజయవాడ హైవేపై పంతంగి, హైదరాబాద్- బెంగళూరు హైవేపై ఉన్న రాయికల్ టోల్‌ప్లాజాల వద్ద మరో నెల పాటు హైబ్రీడ్ వరుసలుగా అనుమతిస్తూ.. కేంద్రం ఉత్తర్వులిచ్చింది. మిగిలిన 75 శాతం వరసలను ఫాస్టాగ్ కోసం కేటాయించాలని తెలిపింది. రాష్ట్రంలోని మిగిలిన 16 టోల్‌ప్లాజాల వద్ద నగదు కోసం ఒక్క వరుస మాత్రమే అనుమతించారు. నెల గడవు తీరాక లేదా పండగ రద్దీ తగ్గిందని భావించిన తరుణంలో ఆ రెండు మార్గాల్లో నగదు కోసం ఒక్కవైపు ఒక్కో వరసను ఏర్పాటు చేయవచ్చని ఉత్తర్వుల్లో కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది.
ఇవీ చూడండి: తెరాస 'పుర' అభ్యర్థులతో మంత్రి కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్