ETV Bharat / state

'ఆంధ్రప్రదేశ్ రకం వైరస్​ బలహీనమైనదే'

దేశంలో కొత్తగా గుర్తించిన బి.617 మినహా ప్రస్తుతం కొత్త వైరస్‌ రకాలేమీ లేవని కేంద్ర బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి రేణూస్వరూప్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎన్.440కె రకం వైరస్‌పై పూర్తిస్థాయి పరిశోధన పత్రాలు ఇంకా ప్రచురితం కాలేదన్నారు.

central-biotechnology-secretary-says-andhra-pradesh-type-virus-is-weak
'ఆంధ్రప్రదేశ్ రకం వైరస్​ బలహీనమైనదే'
author img

By

Published : May 6, 2021, 10:18 AM IST

దేశంలో కొత్తగా గుర్తించిన బి.617 మినహా ప్రస్తుతం కొత్త వైరస్‌ రకాలేమీ లేవని కేంద్ర బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి రేణూస్వరూప్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎన్.440కె రకం వైరస్‌పై పూర్తిస్థాయి పరిశోధన పత్రాలు ఇంకా ప్రచురితం కాలేదన్నారు.

తాము వైరస్‌ జన్యు పరిణామ క్రమాన్ని విశ్లేషించినప్పుడు ఎన్.440కె రకం బయటపడిందని, అది చాలా వేగంగా అంతర్థానమైందని, దాని విస్తరణను తాము చూడలేదన్నారు. దీంట్లో క్లినికల్‌ ప్రభావం ఏమీ కనిపించలేదని స్పష్టంచేశారు. ప్రస్తుతం బి.617 వైరస్‌ రకమే వ్యాప్తిపరంగా, రోగ తీవ్రత పరంగా ప్రభావం చూపుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మన దేశంలో యూకే, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, భారత్‌ రకాల వైరస్‌లున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి: కల్యాణానికి కొవిడ్​ నియమం.. ప్రత్యామ్నాయంతో సిద్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.