భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు స్వామి గౌడ్ మరణం పార్టీకి తనకు తీరని లోటని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇటీవల మరణించిన స్వామిగౌడ్‌కు భాజపా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంతాప సభ నిర్వహించింది.
స్వామి గౌడ్‌కు సంతాపం తెలియజేస్తూ కిషన్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా పార్టీ స్వామిగౌడ్ పనిచేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొనియాడారు.
ఇవీ చూడండి: పత్తికి అదనంగా రూ.275 పెంచండి!