హైదరాబాద్ రాయదుర్గంలో అగ్నిప్రమాదం సంభవించింది. నాసర్ పాఠశాల సమీపంలో గల సెల్‌టవర్‌లో నుంచి ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆందోళనకు గురైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ టవర్ ఐడియా, ఎయిర్‌టెల్‌కి సంబంధించిన సెల్టవర్గా పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి : మిస్సింగ్ కేసును ఛేదించిన తెలంగాణ పోలీస్