ETV Bharat / state

గోల్డెన్​ గ్లోబ్​లో 'ఆర్​ఆర్​ఆర్​' అదుర్స్​.. అభినందించిన పలువురు ప్రముఖులు - Golden Globe award winners RRR 2023

Wishes to RRR Team: ఆర్​ఆర్​ఆర్​ సినిమాకు ప్రఖ్యాత గోల్డెన్​ గ్లోబ్ అవార్డు రావడంతో ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. చిత్రబృందానికి తన శుభాభినందనలు తెలియజేశారు. ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డు గెలుచుకోవటం గర్వకారణమన్నారు

RRR
ఆర్​ఆర్​ఆర్​
author img

By

Published : Jan 11, 2023, 12:31 PM IST

Updated : Jan 11, 2023, 2:21 PM IST

PRIME MINISTER MODI Congratulated RRR Team: ఆర్ఆర్ఆర్ సినిమా విశిష్ట పురస్కారం అందుకోవటం ఆనందంగా ఉందని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకోవటం గర్వకారణమని అభినందించారు. కీరవాణి, రాజమౌళితో పాటు చిత్రబృందానికి తన శుభాభినందనలు తెలుపుతూ ట్వీట్​ చేశారు.

Venakaiah Naidu : మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు రావడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని అన్నారు. అవార్డు అందుకున్న సంగీత దర్శకుడు కీరవాణికి అభినందనలు తెలిపారు.

CHANDRA BABU NAIDU: అలాగే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సైతం అభినందనలు తెలిపారు. ఆర్​ఆర్​ఆర్​ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపి.. తాను గతంలో చెప్పినట్లు తెలుగు భాష భారతీయ సాఫ్ట్ పవర్​గా మారుతోందని చంద్రబాబు ట్వీట్ చేశారు.

Kishan Reddy: తెలుగు సంగీత కీర్తి పతాకను అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడిస్తూ, ఆర్​ఆర్​ఆర్​ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ‘గోల్డెన్ గ్లోబ్ అవార్డు’ దక్కించుకోవడం పట్ల చిత్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, చిత్ర దర్శకుడు రాజమౌళి, నటులు రామ్​చరణ్, జూ.ఎన్టీఆర్ తోపాటుగా ఈ చిత్ర యూనిట్​ మొత్తానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

RevanthReddy: నాటు నాటు పాటకు అంతర్జాతీయ స్థాయి అవార్డు రావడం గర్వకారణమని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. తెలుగు సినిమా స్థాయి ప్రపంచం గుర్తించే విధంగా ఎదిగినందుకు ఆర్​ఆర్​ఆర్​ సినిమా నిర్మాతలకు, దర్శకులకు, పాట రచయితకు, గాయకులకు హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. ఆర్​ఆర్‌ఆర్‌ సినిమాలో నాటు - నాటు సాంగ్​కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంపై చిత్రం యూనిట్​కు శుభాకాంక్షలు చెప్పారు.

Nara Lokesh: ఆర్ఆర్ఆర్ సినిమాకు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు రావడం గర్వకారణమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 11, 2023, 2:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.