తనపై 139 మంది అత్యాచారం చేశారంటూ పంజాగుట్ట ఠాణాలో నమోదైన ఫిర్యాదులో ప్రముఖుల పేర్లు రాయడం వల్ల కేసు ప్రాధాన్యం సంతరించుకుంది. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్లో 139 మంది పేర్లను పోలీసులు చేర్చారు. ఫిర్యాదులో పేర్కొన్న పేర్లను ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. మహిళా అధికారుల సమక్షంలో ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేస్తున్నారు.
ఈ కేసులో బాధితురాలు ఎస్సీ అయినందున... పోలీసులు, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ పలు సంఘాలు ఆందోళనకి దిగాయి. ఏబీవీపీ కార్యకర్తలు ఆమెకు న్యాయం చేయాలంటూ బషీర్బాగ్లోని సీపీ కార్యాలయన్ని ముట్టడించేందుకు యత్నించారు.
ఇవీ చూడండి: అత్యాచారం చేసిన నిందితులను శిక్షించాలని ఎమ్మార్పీఎస్ ధర్నా