ETV Bharat / state

జన్యు రుగ్మతలపై సీసీఎంబీ, సీడీఎఫ్​డీ పోరాటం

జన్యు వ్యాధి సమస్యలను పరిష్కరించేందుకు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సి.సి.ఎమ్.బి), సెంటర్ ఫర్ డిఎన్ఎ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ (సిడిఎఫ్డి) ఒక్కటయ్యాయి. జన్యుపరమైన రోగాలపై కలిసికట్టుగా పోరాడేందుకు ఈ రెండు సంస్థల మధ్య అవగాహన కుదిరింది.

జన్యు రుగ్మతలపై సీసీఎంబీ, సీడీఎఫ్​డీ పోరాటం
author img

By

Published : Jul 4, 2019, 9:44 AM IST

దేశంలో జన్యు వ్యాధితో ప్రతి ఏడాది 50 లక్షలకు పైగా పిల్లలు పుడుతున్నారని జన్యుపరమైన రుగ్మతల అంచనాలు చెబుతున్నాయి. ఈ భారం సమాజంలోని ఆర్థిక, సామాజిక విషయాలపై ప్రభావం పడుతోంది. ఈ రుగ్మతల్లో చాలావరకు ప్రస్తుతం చికిత్స చేయలేనివి ఉండగా.... కొన్ని చికిత్సకు సాధ్యపడినా దానికి ఖర్చులు చాలా ఖరీదైనది. ఈ సమస్యలకు ప్రినేటల్ రోగ నిర్ధారణ, జన్యు సలహాలే ఏకైక నివారణ విధానంగా గుర్తించారు. ఈ సమస్యకు సమర్థవంతమైన, చవకైన డి.ఎన్.ఏ సీక్వెన్సింగ్ టెక్నాలజీ ఉపయోగం. దీని ఆగమనంతో మానవ వ్యాధిపై మన అవగాహనను మెరుగుపరచడంలో ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. రోగ నిర్ధారణ, చికిత్సకు అవసరమైన‌ మార్గాలను అనుమతిస్తుంది.

సి.సి.ఎం.బి డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ కె మిశ్రా, సి.డి.ఎఫ్.డి. డైరెక్టర్ డాక్టర్ దేబాషిస్ మిత్రా మానవ వ్యాధి నిర్ధారణలో రెండు సంస్థల సామర్థ్యాన్ని పెంచడానికి ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించారు. ప్రజలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన డి.ఎన్.ఏ ఆధారిత రోగ నిర్ధారణ సేవలను అందించడం... కొత్త రోగ నిర్ధారణ పద్ధతులను అభివృద్ధి చేయడం, మానవ జన్యుపరమైన రుగ్మతలను అర్థం చేసుకోవడానికి శాస్త్రీయ పరిశోధనలో పాల్గొనడం ఈ అవగాహన ఒప్పందం లక్ష్యాలు. జన్యు విశ్లేషణ రంగంలో శిక్షణ, విద్యా కార్యకలాపాలను చేపట్టడానికి ఈ సంస్థలు పరస్పరం ఒప్పందం కుదుర్చుకున్నాయి.

ccmb, cdfd diseases fight to protect

ఇదీ చూడండి : మూడు లక్షల జరిమానాతో 'రెరా' గడువు పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.