ETV Bharat / state

CC Cameras: ఠాణాల్లో అత్యాధునిక కెమెరాలు.. ఏం చేసినా కనిపిస్తుంది..

author img

By

Published : Feb 21, 2022, 7:59 AM IST

CC Cameras: పోలీస్‌ ఠాణాల్లో సీసీ కెమెరాల వ్యవస్థకు చికిత్సచేసే కీలక కార్యాచరణకు తెలంగాణ పోలీస్‌ ఉన్నతాధికారులు శ్రీకారం చుట్టారు. దేశంలోని పలు ఠాణాల్లో తరచుగా కస్టడీ మరణాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ఈ ప్రాజెక్టుకు బీజం పడింది.

CC Cameras: ఠాణాల్లో అత్యాధునిక కెమెరాలు.. ఏం చేసినా కనిపిస్తుంది..
CC Cameras: ఠాణాల్లో అత్యాధునిక కెమెరాలు.. ఏం చేసినా కనిపిస్తుంది..

CC Cameras: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్‌లో మరియమ్మ మరణం ఉదంతం జరిగిన సమయంలో సీసీ కెమెరాలు పనిచేయలేదు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధి షాద్‌నగర్‌ ఠాణాలో ‘దిశ’ అత్యాచార కేసు నిందితుల్ని ఉంచినప్పుడు ఏం జరిగిందో చూపాలని జస్టిస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌ అడిగితే సీసీ ఫుటేజీ దొరకలేదు. రామగుండం కమిషనరేట్‌లోని మంథని పోలీస్‌స్టేషన్‌లో శీలం రంగయ్య మరణించినప్పుడూ అదే పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీస్‌ ఠాణాల్లో సీసీ కెమెరాల వ్యవస్థకు చికిత్సచేసే కీలక కార్యాచరణకు తెలంగాణ పోలీస్‌ ఉన్నతాధికారులు శ్రీకారం చుట్టారు. ఠాణాల్లో అనుక్షణం ఏం జరుగుతుందో తెలుసుకునేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సీసీ కెమెరాలను అమర్చి, వాటన్నింటినీ హైదరాబాద్‌లో ఆధునిక హంగులతో నిర్మిస్తున్న కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రానికి అనుసంధానించనున్నారు.

దేశంలోని పలు ఠాణాల్లో తరచుగా కస్టడీ మరణాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ఈ ప్రాజెక్టుకు బీజం పడింది. రాష్ట్రవ్యాప్తంగా 4 ఏజెన్సీలకు ఈ బాధ్యతల్ని అప్పగించారు. గరిష్ఠంగా 6 నెలలపాటు బ్యాకప్‌ ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. పోలీస్‌స్టేషన్‌ ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, లాకప్‌..ఇలా కీలక ప్రదేశాలన్నింటినీ గమనించే ప్రాంతాల్లో వీటిని అమరుస్తారు. వీటిని తొలుత సంబంధిత ఏసీపీ/డీఎస్పీ, కమిషనరేట్‌/ఎస్పీ కార్యాలయాల్లోని కంట్రోల్‌ రూంలకు, అక్కణ్నుంచి హైదరాబాద్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం చేయబోతున్నారు. ‘‘తెలంగాణ వ్యాప్తంగా అన్ని పోలీస్‌ స్టేషన్లలో ఇప్పటికే సీసీ కెమెరాలున్నప్పటికీ అవి తరచూ మొరాయిస్తున్నాయి. చెడిపోతే మరమ్మతులు చేసే ప్రక్రియ సక్రమంగా సాగడంలేదు. ప్రక్షాళనలో భాగంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న కెమెరాలను అమర్చబోతున్నాం. ఇప్పటివరకు ఉన్న వాటిలో దృశ్యాలను మాత్రమే చూసే వీలుండేది. ఇప్పుడు ఏర్పాటుచేయబోతున్న వాటిలో మాటలూ స్పష్టంగా రికార్డవుతాయి. దీంతో ఠాణాల్లో ఏ క్షణం ఏం జరిగిందో పక్కాగా తెలుసుకునే వీలు కలుగుతుందని’’ ఓ ఉన్నతాధికారి తెలిపారు. నిఘా ఉంటుంది కాబట్టి ఠాణాలకు వచ్చే ఫిర్యాదుదారులతో సిబ్బంది వ్యవహరించే తీరులోనూ మార్పు వస్తుందని ఆశిస్తున్నామన్నారు. తొలగించిన వాటిని ట్రాఫిక్‌ నిర్వహణకు వినియోగించే యోచనలో ఉన్నట్టు చెప్పారు.

తొలుత తొమ్మిది కమిషనరేట్లలో..

రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 29 పోలీస్‌ యూనిట్లున్నాయి. వీటిలో తొమ్మిది అర్బన్‌ కమిషనరేట్లున్నాయి. తొలుత వీటిలోని దాదాపు 300 ఠాణాల్లో కెమెరాలను అమర్చాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే ఆయా కమిషనరేట్లకు సామగ్రి పంపిణీ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ‘‘మార్చి నెలాఖరులోపు వీటి బిగింపు ప్రక్రియ పూర్తిచేసి, అనంతరం జిల్లాల్లోని ఠాణాల్లో ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నాం. ఆర్నెల్లలోపు అన్నింటినీ అమర్చే క్రతువు పూర్తిచేస్తామని’’ తెలంగాణ పోలీస్‌ టెక్నికల్‌ సర్వీసెస్‌ డీజీపీ రవిగుప్తా తెలిపారు.

ఇదీ ప్రాజెక్టు స్వరూపం

  • సీసీ కెమెరాలు ఏర్పాటుకానున్న ఠాణాలు: 774
  • ఒక్కో ఠాణాలో ఎన్ని: 13 నుంచి 19
  • అమర్చే కెమెరాల సంఖ్య: దాదాపు 8 వేలు
  • ఒక్కో స్టేషన్‌కు అయ్యే ఖర్చు: రూ.10 లక్షలు

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.