ETV Bharat / state

ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్​ఈ సిలబస్​పై ప్రకటన - ఏపీలో సీబీఎస్​ఈ సిలబస్ వార్తలు

ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేందుకు వీలుగా సీబీఎస్‌ఈ సిలబస్​ను ప్రవేశపెడుతున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. రాష్ట్రంలోని 44,639 పాఠశాలలను దశల వారీగా బోర్డుకు అనుసంధానిస్తామని వెల్లడించింది.

cbse in Ap govt schools
cbse in Ap govt schools
author img

By

Published : May 6, 2021, 11:10 AM IST

ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్​ఈ సిలబస్ ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించిన విద్యాశాఖ.. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. 2024-25 ఏడాదిలో పదో తరగతి విద్యార్థులు సీబీఎస్‌ఈ సిలబస్‌లో ఆంగ్ల మాధ్యమంలో పరీక్షలు రాసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. పాఠశాలల నిర్వాహకులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు ఆంగ్ల మాధ్యమంలో ఈ బోర్డు ద్వారా పరీక్షలు నిర్వహించే సామర్థ్యాన్ని పెంపొందిస్తాం.

మూడు, ఐదు, ఎనిమిది తరగతుల విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. రాష్ట్రంలోని 73 శాతం పాఠశాలలను ప్రభుత్వమే నడుపుతోంది. ఈ రెండేళ్లలో 6,13,000 మంది విద్యార్థులు కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ఇందులో 4 లక్షల మంది ప్రైవేటు పాఠశాలల నుంచి వచ్చిన వారే. సీబీఎస్‌ఈలో దేశంలోని విద్యా సంస్థలతో పాటు 26 దేశాల్లోని 25 వేలకు పైగా పాఠశాలలు అనుబంధంగా ఉన్నాయి'. అని పేర్కొంది.

ఇదీ చదవండి: అజిత్ సింగ్ మృతి పట్ల సీఎం కేసీఆర్​ సంతాపం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.